భారత్ తుది జట్టు గురించి ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో తుది జట్టుని అంచనా వేయడం అంత తేలికైన విషయం కాదు. అయితే ఈ కన్ఫ్యూజన్ కి కెప్టెన్ రోహిత్ పుల్ స్టాప్ పెట్టేసాడు.
డబ్ల్యూటీసీ 2023-25 లో భాగంగా టీమిండియా షెడ్యూల్ నేటితో ప్రారంభం కానుంది. వెస్టిండీస్ జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం ఇప్పటికే విండీస్ చేరుకున్న భారత్.. నేడు డొమినికా వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత టీమిండియాకు ఇదే తొలి సిరీస్ కావడం గమనార్హం. ఈ టెస్టు సిరీస్ కోసం సెలక్టర్లు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని కుర్రాలకి అవకాశమిచ్చారు. ఎన్నో ఏళ్లుగా జట్టులో రెగ్యులర్ ప్లేయర్ గా ఉంటున్న పుజారాని ఫామ్ లేమి కారణంగా తప్పించి ఆ స్థానంలో జైస్వాల్, గైక్వాడ్ కి స్థానం కల్పించారు. ఇక బౌలింగ్ లో తొలిసారి ముఖేష్ కుమార్ కి ఇండియన్ స్క్వాడ్ లో చోటు దక్కింది. దీంతో ఇప్పుడు తుది జట్టులో ఎవరుంటారో ఆసక్తి నెలకొంది. అయితే రోహిత్ శర్మ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేసాడు.అంతే కాదు తుది జట్టు గురించి హింట్ ఇచ్చాడు.
భారత్ తుది జట్టు గురించి ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో తుది జట్టుని అంచనా వేయడం అంత తేలికైన విషయం కాదు. అయితే ఈ కన్ఫ్యూజన్ కి కెప్టెన్ రోహిత్ పుల్ స్టాప్ పెట్టేసాడు. తనతో కలిసి జైస్వాల్ ఓపెనింగ్ కి దిగుతాడని చెప్పేసాడు. గత కొన్నేళ్లుగా ఓపెనర్ గా రాణిస్తూ అద్భుతమైన ఫామ్ లో ఉన్న గిల్ ఎక్కడ ఆడతాడు అనే అనుమానం మీలో రావొచ్చు. ఆ విషయంపై మాట్లాడుతూ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ కి వస్తాడని చెప్పేసాడు. గిల్ కూడా నా కెరీర్ లో ఎక్కువగా మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసేవాడినని కోచ్ రాహుల్ ద్రావిడ్ తో చెప్పుకొచ్చాడు. దీంతో మూడో స్థానం గిల్ కి ఫిక్స్ అయింది. అంతేకాదు లెఫ్ట్, రైట్ కాంబినేషన్ కూడా కలిసి వస్తుంది. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానే ఆడతారు.
బౌలర్ల గురించి మాట్లాడుతూ ముగ్గురు సీమర్లకి తుది జట్టులో ఆడిస్తాము అని చెప్పాడు. సిరాజ్, ఉనాద్కట్ ఆడడం దాదాపు గ్యారంటీ. ఇక మూడో స్థానం కోసం సైనీ, ముఖేష్ కుమార్ మధ్య పోటీ నెలకొంది. మరో వైపు స్పిన్నర్లుగా అశ్విన్, జడేజా స్థానాలకు ఎలాంటి ప్రమాదం లేదు. మరో వైపు కొత్త కుర్రాళ్లతో నిండిపోయిన విండీస్ జట్టు భారత్ ని తట్టుకొని నిలబడడం కష్టమే అనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సొంతగడ్డపై ఏ జట్టుని తక్కువగా అంచనా వేయలేము.కెప్టెన్ బ్రెత్ వైట్, చంద్రపాల్ తో పాటు బ్లాక్ వుడ్ కూడా ప్రమాదకారి బ్యాటర్ అనే సంగతి తెలిసిందే. ఇక బౌలింగ్ లో కీమర్ రోచ్, అల్జారీ జోసెఫ్, హోల్డర్ లతో విండీస్ బౌలింగ్ యూనిట్ బలంగా కనిపిస్తుంది. మొత్తానికి ఈ సారి కొత్తగా కనిపిస్తున్న భారత తుది జట్టు మీకేవిధంగా అనిపిస్తుందో కామెంట్ల రూపంలో తెలపండి.
New opening pair of Indian Test cricket.
It’s Rohit Sharma & Yashasvi Jaiswal. pic.twitter.com/abstSjSSkm
— Johns. (@CricCrazyJohns) July 11, 2023