ముంబైని ముంచేసిన కిషన్ పై రోహిత్ సీరియస్ అయ్యాడా?

Rohit sharma angry on ishan kishan

ఐపీఎల్‌ 2022లో ముంబై ఇండియన్స్‌ పూర్‌ పార్ఫార్మెన్స్‌ కొనసాగుతోంది. ఈ సీజన్‌లో వరుసగా తొలి 8 మ్యాచ్‌లలోనూ ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. సోమవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 36 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు పర్వాలేదనిపించినా.. బ్యాటర్ల ఘోర వైఫల్యంతో ముంబై మ్యాచ్‌ ఓడింది. ముఖ్యంగా ముంబై ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ 20 బంతులాడి కేవలం 8 పరుగుల మాత్రమే చేశాడు. సహజంగా ఎటాకింగ్‌ ప్లే ఆడే ఇషాన్‌ ఈ మ్యాచ్‌లో మాత్రం పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇదే విషయమై.. ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇషాక్‌ కిషన్‌పై సీరియస్‌ అయినట్లు సమాచారం.

ముంబై గెలుపోటములు పక్కన పెడితే.. ఇషాన్‌ కిషన్‌ తన సహజ శైలికి భిన్నంగా ఆడుతుండడంపై రోహిత్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. పవర్‌ప్లేలో ఎటాకింగ్‌ అప్రోచ్‌తో భారీగా పరుగులు రాబట్టే కిషన్‌.. ఇలా ఎందుకు తడబడుతున్నాడో అర్థం కావడం లేదని.. రోహిత్‌ పేర్కొన్నట్లు సమాచారం. తొలి రెండు మ్యాచ్‌లలో పర్వాలేదనిపించిన కిషన్‌.. తర్వాత వరుసగా 6 మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలం అయ్యాడు. చివరి ఆరు మ్యాచ్‌లలో కిషన్‌ చేసిన పరుగులు 64. దీన్ని బట్టి అతని బ్యాటింగ్‌ ఎలా ఉందో అర్థం అవుతుంది. ఐపీఎల్‌ ఫలితాలను పక్కనపెట్టినా.. భవిష్యత్తులో జరగబోయే టీ20 వరల్డ్‌ కప్‌ దృష్టిలో పెట్టుకుని రోహిత్‌ శర్మ.. ఇషాన్‌ కిషన్‌ను వారించినట్లు తెలుస్తుంది.

 Rohith is serious about Ishaan Kishan!

ముంబై లాంటి టీమ్‌.. క్వింటన్‌ డికాక్‌ను కాదని కిషన్‌ను రూ.15.25 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేయడానికి కారణం.. అతని బ్యాటింగ్‌ అప్రోచ్‌. ఎలాంటి బౌలర్‌ అయినా కూడా పవర్‌ప్లేలో పరుగులు రాబట్టగలడనే నమ్మకంతో ముంబై అతన్ని పిక్‌ చేసుకుంది. కానీ.. కిషన్‌ తన బలాన్ని పక్కన పెట్టి.. డిఫెన్స్‌ ఆటతీరుతో అట్టర్‌ ఫ్లాప్‌ అవుతున్నాడు. ఓటముల కారణంగా కొంత ఒత్తిడి ఉన్న మాట నిజమే అయినా.. దాన్ని కిషన్‌ తన బలమైన ఎటాకింగ్‌ అప్రోచ్‌తోనే ఛేదించగలడనేది.. రోహిత్‌ గట్టి నమ్మకం. అందుకే.. ఒక్క ఐపీఎల్‌ కోసమే కాకుండా టీ20 వరల్డ్‌ కప్‌ను దృష్టిలో పెట్టుకుని కిషన్‌ మైండ్‌ను వాష్‌ చేశాడు. రోహిత్‌ శర్మ.. ముంబైకు మాత్రమే కాదు.. టీమిండియా కెప్టెన్‌ అన్న సంగతి మర్చిపోకూడదు. ఐపీఎల్‌ గురించి శ్రమిస్తూనే టీమిండియా భవిష్యత్తుపై కూడా ఒక కన్నేస్తాడు రోహిత్‌. అందులో భాగంగానే ఇషాన్‌ కిషన్‌ను గాడిలో పెట్టేందుకు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: 66 ఏళ్ల వయసులో టీమిండియా క్రికెటర్‌ రెండో పెళ్లి

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.