66 ఏళ్ల వయసులో టీమిండియా క్రికెటర్‌ రెండో పెళ్లి

Team India cricketer's second marriage at the age of 66

టీమిండియా మాజీ క్రికెటర్‌, ప్రస్తుత బెంగాల్‌ హెడ్‌కోచ్‌ అరుణ్‌ లాల్‌ రెండు వివాహానికి సిద్ధమయ్యారు. తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్న ఆయన బుల్బుల్‌ సాహో అనే యువతిని వివాహం చేసుకోనున్నారు. ప్రస్తుతం అరుణ్‌ లాల్‌ వయసు 66 ఏళ్లు. ఆయన వివాహం చేసుకోనే యువతి వయసు 30 ఏళ్లు. మే 2న వీరిద్ధరి వివాహం జరగనుంది.

వారం రోజులు ముందుగానే వీరి వివాహానికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఈ పెళ్లితో అరుణ్‌ లాల్‌ రెండోసారి కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఇక ఆయన క్రికెట్‌ కెరీర్‌ విషయానికి వస్తే.. 1982లో శ్రీలంకతో జరిగిన టెస్టులో జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. భారత్‌ తరపున 16 టెస్టులాడి 729 పరుగులు చేశారు. 13 వన్డేల్లో 122 పరుగులు చేశారు. 1989 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్న అరుణ్‌ లాల్‌.. ప్రస్తుతం బెంగాల్‌ స్టేట్‌ టీమ్‌కు హెడ్‌ కోచ్‌గా ఉన్నారు. మరి అరుణ్‌ లాల్‌ రెండో పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Team India cricketer's second marriage at the age of 66

 

ఇదీ చదవండి: రికార్డుల మోతమోగించిన శిఖర్‌ ధావన్‌! రోహిత్‌ రికార్డు బద్దలు

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.