రికార్డుల మోతమోగించిన శిఖర్‌ ధావన్‌! రోహిత్‌ రికార్డు బద్దలు

Dhawan rare feat on CSK!

ఐపీఎల్‌ 2022లో శిఖర్‌ ధావన్‌ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సోమవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్‌ 59 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ధావన్‌ పలు రికార్డులను నెలకొల్పాడు. ఈ ఫిఫ్టీతో పటిష్టమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌పై 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ధావన్‌ చరిత్ర సృష్టించాడు. అలాగే ఒకే టీమ్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా శిఖర్‌ ధావన్‌ నిలిచాడు. చెన్నైసూపర్‌ కింగ్స్‌పై ధావన్‌ ఇప్పటి వరకు 1029 పరుగులు చేశాడు.

ఏదైన ఒక టీమ్‌ ఇన్ని పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా ధావన్‌ రికార్డు సృష్టించారు. ధావన్‌ తర్వాత ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌పై 1018 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కాగా.. ఈ మ్యాచ్‌ శిఖర్‌ ధావన్‌కు 200వ ఐపీఎల్‌ మ్యాచ్‌ ఇలాంటి ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌లో ధావన్‌ రాణించడంతో అతని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఇన్నింగ్స్‌తో ధావన్‌ టీ20ల్లో​ 9 వేల పరుగుల, ఐపీఎల్‌లో 6 వేల పరుగుల మైలురాయి సొంత చేసుకున్నాడు. విరాట్‌ కోహ్లీ తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. దీంతో.. ఈ మ్యాచ్‌తో శిఖర్‌ ధావన్‌ ముచ్చటైన మూడు రికార్డులను సాధించాడు. మరి ధావన్‌ రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 Dhawan rare feat on CSK!

ఇదీ చదవండి: టీ20 వరల్డ్ కప్ కి పంత్ ప్లేస్ లో దినేష్ కార్తీక్ ని ఆడించండి : హర్భజన్

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.