ఐపీఎల్ 2022లో శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆ జట్టుకు పాయింట్ల పట్టికలో రెండో స్థానం దక్కింది. దీంతో రాజస్థాన్‌కు ఫైనల్ చేరేందుకు రెండు అవకాశాలు ఉంటాయి. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. మొయిన్ అలీ 57 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సులతో 93 పరుగులు చేసి రాణించాడు. మిగతా బ్యాటర్లు విఫలం అవ్వడంతో చెన్నై తక్కువ స్కోర్‌కే పరిమితం అయింది.
ఇక సాధారణ లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌కు తొలి ఓవర్లో తొలి రెండు బంతులు ఫోర్లు బాది యశస్వి జైశ్వాల్ మంచి మూమెంటమ్ ఇచ్చాడు. కానీ రెండో ఓవర్లో సిమర్జీత్ సింగ్ బౌలింగ్లో ప్రమాదకర బట్లర్ (2)ఔటవ్వడంతో రాజస్థాన్‌కు గట్టిదెబ్బే తగలింది. అయినప్పటికీ యశస్వి జైశ్వాల్ మాత్రం అడపాదడపా ఫోర్లు బాదుతూ స్కోరు బోర్డును నడిపించాడు. కెప్టెన్ శాంసన్ కూడా అతనికి జత కలవడంతో రన్ రేట్ మెయింటెన్ చేయగలిగారు. ఈ క్రమంలో వీరిద్దరి జోడీ 50పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ జోడీని తొమ్మిదో ఓవర్లో సాంట్నార్ విడదీశాడు. శాంసన్‌ను (15పరుగులు 20బంతుల్లో) కాట్ అండ్ బౌల్డ్‌గా ఔట్ చేశాడు. ఆ తర్వాత 12ఓవర్లో పడిక్కల్ (3)ను మొయిన్ అలీ ఔట్ చేశాడు.
ఇక మిడిలార్డర్లో దిగిన అశ్విన్ బాధ్యతాయుతంగా ఆడాడు. 14వ ఓవర్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జైశ్వాల్.. 15వ ఓవర్లో సోలాంకి బౌలింగ్లో సిక్స్ కొట్టాడు. తర్వాత క్యాచ్ ఔటయ్యాడు. ఇక చివరి 5ఓవర్లో 47పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొనగా.. 17వ ఓవర్లో సొలాంకి ప్రమాదకర హెట్ మయర్ (6)ను క్యాచ్ అవుట్ చేశాడు. ఇక రియాన్ పరాగ్‌తో కలిసి అశ్విన్ మాత్రం వీరోచితంగా పోరాడాడు. ఆ ఓవర్ చివరి బంతికి సిక్స్ బాదిన అశ్విన్.. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అశ్విన్ పోరాటానికి చివరి ఓవర్లో ఆర్ఆర్ కేవలం 7పరుగులు చేయాల్సి వచ్చింది. ఇక చివరి ఓవర్లో రెండో బంతికి ఫోర్ కొట్టి మ్యాచ్‌ను రాజస్థాన్ చేతుల్లో పెట్టాడు. ఇక మతీషా పతిరాణా వైడ్ వేయడంతో రాజస్థాన్ మరో రెండు బంతులు ఉండగానే గెలిచింది. ఈ విజయంతో అశ్విన్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది.
ఆల్‌రౌండర్‌గా గుర్తించాల్సిందేనా..
టీమిండియా స్టార్ స్పిన్నర్‌గా ఇన్ని రోజులు గుర్తింపు పొందిన అశ్విన్.. తానో నిఖార్సయిన ఆల్‌రౌండర్‌లా ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆడుతున్నాడు. ఇప్పటికే అశ్విన్ ఈ సీజన్‌లో వన్‌డౌన్‌లో వచ్చి ఒక హాఫ్‌సెంచరీ కూడా చేశాడు. ఇక శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఫినిషింగ్‌తో మ్యాచ్ గెలిపించాడు. ఏదో గుడ్డిగా కాకుండా ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ ఆడుతూ ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 28 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ కూడా తీశాడు. బౌలింగ్‌లో అశ్విన్ ఎంతటి ఇంప్యాక్ట్ చూపిస్తాడాతో మనకు తెలిసిందే.. కానీ బ్యాటింగ్‌లో కూడా అంచనాలకు మించి రాణిస్తున్నాడు. దీంతో అశ్విన్‌ను ఆల్‌రౌండర్‌గా గుర్తించాలనే డిమాండ్ ఫ్యాన్స్ నుంచి వ్యక్తం అవుతుంది. టెస్టుల్లో కూడా అశ్విన్ చాలా సార్లు తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. మరి అశ్విన్ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: MS Dhoni: ధోని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! IPL 2023లోనూ ధోనీ!
Ravi Ashwin is showing his batting abilities in IPL 2022.
📸: Disney+Hotstar pic.twitter.com/6Au7PR3fai
— CricTracker (@Cricketracker) May 20, 2022