భారత్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ టెస్టు మ్యాచ్ ఆడితే రికార్డులు బద్దలవ్వడం గ్యారంటీగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఎన్నో ప్రపంచ రికార్డులని తన ఖాతాలో వేసుకున్నాడు.
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ స్పిన్నర్ విండీస్ జట్టుకి పీడ కలలా మారాడు. తన స్పిన్ మాయాజాలంతో కరీబియన్ టీంని తిప్పేసాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి మొత్తం 12 వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో మరింతలా చెలరేగి 7 వికెట్లు తీసుకున్నాడు. అసలే విండీస్ జట్టు మీద మంచి ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్న అశ్విన్ ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ లో తన మ్యాజిక్ ని మరోసారి చూపించాడు. ఈ క్రమంలో ఎన్నో ప్రపంచ రికార్డులని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ రికార్డులేంటో ఇప్పుడు చూద్దాం.
భారత్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ టెస్టు మ్యాచ్ ఆడితే రికార్డులు బద్దలవ్వడం గ్యారంటీగా కనిపిస్తుంది. ఈ టెస్టులో 10 వికెట్ల హాల్ లో మరోసారి చేరిన అశ్విన్.. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ని అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో బజ్జీ ఇప్పటివరకు 707 వికెట్లు తీస్తే తాజాగా అశ్విన్(709) ఆ రికార్డ్ ని బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో అనీల్ కుంబ్లే 953 వికెట్లతో టాప్ లో ఉన్నాడు. ఇక వెస్టిండీస్ పై ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా అశ్విన్ నిలిచాడు. అంతేకాదు విండీస్ పై ఒక టెస్టు మ్యాచులో అత్యధిక వికెట్లు తీసుకున్న స్పిన్నర్ గా రికార్డ్ క్రియేట్ చేసాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ పాక్ స్పిన్నర్ అజ్మల్ పేరిట ఉంది. అజ్మల్ 11 వికెట్లతో టాప్ లో ఉండగా తాజాగా నిన్న జరిగిన డోమినికా టెస్టులో అశ్విన్ ఈ రికార్డ్ ని బ్రేక్ చేసాడు. టెస్టుల్లో అత్యధిక 5 వికెట్లు తీసుకున్న బౌలర్ల లిస్టులో 5 వ స్థానంలో నిలిచాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే వెస్టిండీస్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 2 వికెట్లకు 312 పరుగులతో ఓవర్ నైట్ స్కోర్ తో బ్యాటింగ్ ప్రారంభించిన రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్ ని 5 వికెట్లను 421 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కెరీర్ లో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఓపెనర్ జైస్వాల్ డబుల్ సెంచరీ(171) మిస్ చేసుకోగా.. కోహ్లీ(76) అర్ధ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత వచ్చిన జడేజా 37 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ జట్టు మరోసారి ఘోరంగా విఫలమైంది. కేవలం 130 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో పరాజయం చూడాల్సి వచ్చింది. మొత్తానికి విండీస్ కి చుక్కలు చూపించిన అశ్విన్ బౌలింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.