సాధారణంగా క్రికెట్ లో తండ్రి కొడుకులతో ఆడడం అనేది అరుదైన ఘనత. కానీ అశ్విన్ అంతకు మించే రికార్డ్ ఒకటి సెట్ చేసాడు.
టీమిండియా టెస్టు క్రికెట్ ఆడుతుందంటే చాలు స్టార్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డులను తన పేరు మీద సెట్ చేసే పనిలో ఉంటాడు. కెరీర్ ప్రారంభం నుంచి ఎక్కడా తన గ్రాఫ్ తగ్గకుండా చెలరేగిపోతున్నాడు. ప్రస్తుతం టెస్టుల్లో వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్న అశ్విన్.. తాజాగా వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఒక క్రేజీ రికార్డ్ సృష్టించాడు. ఈ మ్యాచులో మరోసారి 5 వికెట్లతో సత్తా చాటిన అశ్విన్.. తన పేరు మీద ఒక అరుదైన రికార్డును లిఖించుకున్నాడు. అంతేకాదు ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్ గా చరిత్ర సృష్టించాడు. ఇంతకీ అశ్విన్ సాధించిన ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా క్రికెట్ లో తండ్రి కొడుకులతో ఆడడం అనేది అరుదైన ఘనత. కానీ అశ్విన్ అంతకు మించే రికార్డ్ ఒకటి సెట్ చేసాడు. తండ్రి కొడుకులిద్దరిని అవుట్ చేసి ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్ గా నిలిచాడు. అశ్విన్ కి ముందే ఈలిస్టులో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ ఇయాన్ బోధం, పాకిస్థాన్ పేస్ బౌలర్ వసీం అక్రమ్, ఆస్ట్రేలియా యార్కర్ల వీరుడు మిచెల్ స్టార్క్ ఉన్నారు. అయితే స్పిన్నర్ గా మాత్రం అశ్విన్ మాత్రమే ఈ ఘనత అందుకోవడం విశేషం. 2011 సంవత్సరంలో వెస్టిండీస్‌తో డెబ్యూ చేసిన అశ్విన్.. ఆ మ్యాచు రెండో ఇనింగ్స్ లో శివనారయణ్ చందర్‌పాల్ ని ఔట్ చేసాడు. ఇక నిన్న జరిగిన తొలి తన కొడుకు తగెనరైన్ చందర్‌పాల్‌ను అశ్విన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్ లో ఎక్కువ బౌల్డ్ లు చేసిన భారత బౌలర్ గా మరో రికార్డ్ నెలకొల్పాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ జట్టు కేవలం 150 పరుగులకే ఆలౌటైంది. జట్టులో ఒకరు కూడా హాఫ్ సెంచరీ సాధించలేదు. 47 పరుగులు చేసిన అతంజ టాప్ స్కోరర్. భారత్ బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లతో వెస్టిండీస్ భరతం పట్టగా.. జడేజా 3 వికెట్లతో రాణించాడు. సిరాజ్, శార్ధూల్ ఠాకూర్ కి తలో వికెట్ దక్కింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ వికెట్లేమీ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. డెబ్యూ కుర్రాడు జైస్వాల్ 40 పరుగులతో, కెప్టెన్ రోహిత్ శర్మ 30 పరుగుట్లతో క్రీజ్ లో ఉన్నారు. మొత్తానికి అశ్విన్ సాధించిన అరుదైన ఘనత మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
When nothing happened, we ‘turned’ to Ashwin!
..#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/wwPuS1QZG2
— FanCode (@FanCode) July 12, 2023