ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ మూడో విజయం సాధించింది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్ హెట్‌మేయిర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 36 బంతుల్లో 56 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 సిక్సులు ఉన్నాయి. ముఖ్యంగా చివరి ఓవర్లలో లక్నో బౌలర్లను చీల్చిచెండాడు. హెట్‌మేయిర్ ఇంత హిట్టింగ్ చేయకముందే ఒక లైఫ్ దొరికింది.
14 బంతుల్లో కేవలం 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద.. లక్నో బౌలర్ కృష్ణప్ప గౌతమ్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ తొలి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన హెట్‌మేయిర్ సరిగా టైమ్ చేయలేకపోయాడు. దీంతో కొద్ది సేపుగాల్లో ఉన్న బంతి లాంగ్ ఆఫ్‌లో ఉన్న కృనాల్ పాండ్యా చేతికి వెళ్లింది. కానీ.. చాలా సునాయాసమైన క్యాచ్‌ను జారవిడిచాడు. ఆ క్యాచ్ కృనాల్ పట్టిఉంటే.. రాజస్థాన్ అంత స్కోర్ చేసేది కాదు. లక్నో ఓటమికి హెట్‌మేయిర్ ఇన్నింగ్స్ ప్రధాన కారణంగా క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.కాగా.. లక్నో సూపర్ జెయింట్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కృనాల్ పాండ్యాను ట్రోల్ చేస్తున్నారు. ‘గ్రౌండ్‌లో ఓవర్ యాక్షన్ చేయకుండా.. క్యాచ్‌లు సరిగా పట్టు’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కృనాల్ ఆ క్యాచ్ పట్టిఉంటే.. లక్నో పరిస్థితి వేరేలా ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో లక్నో 20 ఓవర్లు ఆడి 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి గెలుపు ముంగిట్లో బోల్తా కొట్టింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీడియో: నటరాజన్ సూపర్ డెలివరీ.. గైక్వాడ్‌కు దిమ్మతిరిగింది!
Krunal Pandya dropping hetmyer catch was game changing. #LSGvRR pic.twitter.com/66yBPq0QQO
— padosii (@padosiii) April 10, 2022
Krunal pandya blaming his hands for dropping the catch 😜🤣..#LSGvRR #IPL2022 #crickettwitter pic.twitter.com/7QDCBhfROF
— Kunal Goel (@KunalGo74194380) April 10, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.