ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం లక్నో సూపర్ జయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.మొదట బ్యాటింగ్ చేసిన లక్నో టీం.. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.ఇక ఈ మ్యాచులో కృనాల్ పాండ్య తీసుకున్న ఒక నిర్ణయం ఆకట్టుకుంటుంది.
ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం లక్నో సూపర్ జయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.లక్నోలోని అటల్ బిహారీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో టీం.. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓ దశలో 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన లక్నో జట్టుని కెప్టెన్ క్రునాల్ పాండ్య(49), అల్ రౌండర్ స్టొయినీస్ ఆదుకున్నారు. ముఖ్యంగా స్టొయినీస్ బౌండరీలే లక్ష్యంగా చెలరేగి ఆడాడు. 47 బంతుల్లోనే 89 పరుగులు చేసి జట్టుకి భారీ స్కోర్ ని అందించాడు. ఇక ఈ మ్యాచులో కృనాల్ పాండ్య తీసుకున్న ఒక నిర్ణయం ఆకట్టుకుంటుంది.
కృనాల్ పాండ్య బ్యాటింగ్ లో అదరగొట్టాడు. కానీ 49 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఇందులో విశేషం ఏముంది అనుకోకండి. కృనాల్ రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ కి వెళ్ళాడు. అయితే చూస్తుంటే అతడికి ఎలాంటి గాయం అయినట్లుగా అనిపించడం లేదు. సహచర ప్లేయర్ పూరం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. జట్టు స్కోర్ 16 ఓవర్లలో 117 పరుగుల వద్ద ఉన్నప్పుడు పూరన్ కి బ్యాటింగ్ ఇచ్చే ఉద్దేశ్యంలో కృనాల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. పూరన్ ఈ ఐపీఎల్ లో ఎంతలా విధ్వంసం సృష్టించాడో మనకు తెలిసిందే. దీంతో స్కోర్ వేగాన్ని పెంచడానికే పూరన్ కి ఈ అవకాశం ఇచ్చి ఉండొచ్చని తెలుస్తుంది. ఈ క్రమంలో తన వ్యక్తిగత స్కోర్ 49 దగ్గర రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగడం విశేషం. మరి పూరన్ తీసుకున్న ఈ నిర్ణయం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.