కనిపించని ఆటగాడి మీద సంచలన వ్యాఖ్యలు చేయడం సహజం. కానీ సహచర ఆటగాళ్ల మీద ఇప్పుడు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు కృనాల్ పాండ్య. బహిరంగంగానే తన జట్టులో ఒకరికి చాలా బద్ధకం అని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
లక్నో సూపర్ జయింట్స్ కెప్టెన్ రాహుల్ కి ఎప్పుడైతే గాయమైందో.. అప్పటినుంచి జట్టు బాధ్యతలు తీసుకున్నాడు కృనాల్ పాండ్య. కెప్టెన్ గా ఇప్పటివరకు రెండు మ్యాచులు ఆడిన క్రునాల్.. ఒక మ్యాచులో ఓడిపోగా మరో మ్యాచ్ రద్దయింది. మ్యాచులు గెలిపించకపోయినా.. సహచర ఆటగాళ్ల మీద ఇప్పుడు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు. బహిరంగంగానే తన జట్టులో ఒకరికి చాలా బద్ధకం అని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కనిపించని ఆటగాడి మీద సంచలన వ్యాఖ్యలు చేయడం సహజం. కానీ తన జట్టులోనే ఒకరి గురించి ఇలా చెప్పడం కాస్త షాకింగ్ గా అనిపిస్తుంది. అసలు కృనాల్ ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం.
లక్నో సూపర్ జయింట్స్ తన చివరి మ్యాచ్ ని గుజరాత్ టైటాన్స్ తో ఆడింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత ఈ శనివారం సన్ రైజర్స్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మధ్యలో 6 రోజుల గ్యాప్ ఉండడంతో ప్రస్తుతం సూపర్ జయింట్స్ ఆటగాళ్లు రిలాక్ మూడ్ లో కనిపిస్తూ చిల్ అవుతున్నారు. ఇందులో భాగంగా యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో క్రునాల్ కొన్ని విషయాలను సమాధానం చెబుతూ కనిపించాడు. క్రునాల్ తో పాట్ పూరన్ కూడా ఈ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసాడు. ఇక మీ టీంలో బాగా లెజియస్ట్ ప్లేయర్ ఎవరు అనే ప్రశ్నకు పూరన్ కైల్ మేయర్స్ పేరు చెప్పగా.. కృనాల్ మాత్రం డికాక్ పేరు చెప్పాడు.
“డికాక్ చాలా బద్ధకస్తుడు. 8,9 గంటలు పడుకున్నా సరే నేను బాగా అలసిపోయాను అనేలా ఫేస్ పెడతాడు. డికాక్ లాంటి బద్ధకస్తుడిని నేనింతవరకు చూడలేదని చెప్పుకొచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలు సరదాగా చేశాడా లేకపోతే నిజంగానే అన్నాడా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ సీజన్లో లక్నో 11 మ్యాచుల్లో 5 మ్యాచుల్లో గెలిచి 11 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. చెన్నైతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మిగిలిన మూడు మ్యాచుల్లో కనీసం రెండైనా గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. మొత్తానికి క్రునాల్ పాండ్య.. డికాక్ మీద చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయి కామెంట్ల రూపంలో తెలపండి.