ఐపీఎల్ మ్యాచ్ లో ఏం జరగాలనేది ముందే ఫిక్సవుతోందా? అంటే ఏమో చూస్తుంటే అలానే అనిపిస్తోంది బాబోయ్ అని అందరూ అనుకుంటున్నారు. తాజాగా లక్నో-రాజస్థాన్ మ్యాచ్.. ఈ డౌట్స్ రావడానికి కారణమైంది.
ఈసారి ఐపీఎల్ స్టార్ట్ అవడానికి ముందు అంతగా బజ్ లేదు. జనాలు కూడా.. చెన్నై, ముంబయి, ఆర్సీబీ మ్యాచులు తప్పితే.. మిగతా జట్లు ఆడుతుంటే చూడటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అలాంటిది సడన్ గా ఈ సీజన్ లో పూర్తిగా సీన్ మారిపోయింది. గత నాలుగైదు మ్యచ్ లు థ్రిల్లర్స్ సినిమాల్ని తలపిస్తున్నాయి. ఎందుకంటే గెలుస్తుంది అనుకున్న టీమ్.. చివరి వరకు తీసుకొచ్చి ఓడిపోతోంది. వేరే ఏ మ్యాచ్ వరకు అక్కర్లేదు. తాజాగా జరిగిన లక్నో-రాజస్థాన్ మ్యాచ్ నే తీసుకోండి. ఛేదనలో రాజస్థాన్ బ్యాటింగ్ చూసి అందరూ గెలుపు వీళ్లదే అని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీంతో ప్రేక్షకులకు కొత్త డౌట్స్ వస్తున్నాయి.
ఇక విషయానికొస్తే.. బిగ్ బాస్ తోపాటు చాలా టీవీ షోలు ఓ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంటాయి. మనలో చాలామంది చూసే WWE కూడా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతూ ఉంటుంది. కాకపోతే అవి ఓ ప్లానింగ్ ప్రకారం జరుగుతాయని రీసంట్ టైమ్స్ లో తెలిసింది తప్పితే ఆ విషయం ఇన్నేళ్లపాటు బయటపడలేదు. ఇప్పుడు ఆ లిస్టులోకి ఐపీఎల్ కూడా చేరిందా అనిపిస్తుంది. కొన్నిరోజుల నుంచి మ్యాచులన్నీ కూడా చివరి ఓవర్ వరకు వస్తున్నాయి. దీంతో ఐపీఎల్ లవర్స్ కు లేనిపోని సందేహాలు వస్తున్నాయి. దీనికి తోడు ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ కూడా ఐపీఎల్, దాదాపు 80 శాతం స్క్రిప్టెడ్ అని అనడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
తాజా మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. 154/7 స్కోరు చేసింది. మేయర్స్ 51, కెప్టెన్ రాహుల్ 39 రన్స్ కొట్టారు. రాజస్థాన్ బౌలర్లు కట్టడి చేయడంతో ఈ రన్స్ కొట్టింది. ఛేదనలో రాజస్థాన్ కు అదిరిపోయే ఆరంభం లభించింది. తొలి వికెట్ కు యశస్వి (44), బట్లర్ (40).. ఏకంగా 87 పరుగులు జోడించారు. వీళ్లద్దరూ ఔటైపోయిన తర్వాత మిగతా బ్యాటర్ల ఎందుకో ఫెయిలయ్యారు. పోనీ చివర్లో అయినా సరే హిట్టింగ్ చేస్తారా అనుకుంటే.. టెస్టు బ్యాటింగ్ ని తలపించేలా ఆడారు. ఫలితంగా లక్నో జట్టు.. 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదే కాదు గత నాలుగైదు మ్యాచులు ఇలానే జరిగాయి. ఒకటో రెండో అంటే అలా అనుకోవచ్చు కానీ ఇలా వరసపెట్టి అన్నీ చివరి ఓవర్ వరకు వస్తుండటం ఎందుకో సరికొత్త డౌట్స్ క్రియేట్ చేస్తోంది. మరి ఐపీఎల్ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతున్నాయంటూ వస్తున్న న్యూస్ పై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.