ఐపీఎల్ లో లక్నో జట్టుకి గట్టి ఎదరు దెబ్బ. స్టార్ ఓపెనర్, కెప్టెన్ రాహుల్ గాయం ఆ జట్టుని కలవరపెడుతుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కొత్త కెప్టెన్ ఎవరనేది లక్నో యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.
ఈ సీజన్ ఐపీఎల్ లో ఎప్పుడు లేని విధంగా స్టార్ ప్లేయర్లకు గాయాల సమస్య వెంటాడుతుంది. ఇప్పటికే పంత్, బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ లాంటి గాయాలతో టోర్నీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా లక్నో కెప్టెన్ రాహుల్ గాయంతో ఈ టోర్నీకి దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. బెంగళూరుతో జరిగిన మ్యాచులో బౌండరీ రోప్ దగ్గర ఫీల్డింగ్ చేస్తూ రాహుల్ గాయపడ్డాడు. ఈ కారణంగానే ఈ మ్యాచులో రాహుల్ నెంబర్ 11 లో బ్యాటింగ్ కి దిగాడు. ఇక లక్నో సూపర్ జయింట్స్ జట్టు రాహుల్ సేవలను మిస్ అవుతుండడంతో ఇప్పుడు ఆ జట్టు కొత్త కెప్టెన్ ఎవరనేది లక్నో యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.
ఐపీఎల్ లో లక్నో జట్టుకి గట్టి ఎదరు దెబ్బ. స్టార్ ఓపెనర్, కెప్టెన్ రాహుల్ గాయం ఆ జట్టుని కలవరపెడుతుంది. ఈ నేపథ్యంలో రాహుల్ లేని లోటుని తీర్చడం అంత సామాన్యమైన విషయం కాదు. ప్లే ఆఫ్ కి చేరుకోవాలంటే లక్నో టీమ్ కి ప్రతి మ్యాచ్ కూడా కీలకమే. రాహుల్ లక్నో టీమ్ కి కెప్టెన్ మాత్రమే కాదు. మంచి ఓపెనర్ కూడా. దీంతో ఇప్పుడు రాహుల్ స్థానంలో ఎవరు బ్యాటర్ గా బరిలోకి దిగుతారు?ఎవరు కెప్టెన్సీ చేస్తారనే విషయంలో క్లారిటీ వచ్చింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్య నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో జరగబోయే మ్యాచులో తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గత మ్యాచులో రాహుల్ గాయమై పెవిలియన్ కి వెళ్తే కృనాల్ కెప్టెన్సీ చేస్తూ కనిపించాడు. అయితే క్రునాల్ పాండ్య నేటి మ్యాచ్ కేనా లేకపోతే తర్వాత మళ్ళీ కొత్త కెప్టెన్ ని మార్చనున్నారా అనే విషయం తేలాల్సి ఉంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.