భారతదేశంలో క్రికెట్ కు, రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంటుంది. ఆ విషయం ఇప్పటికే మనందరికి తెలుసు. క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత ఆటగాళ్లు రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన సంఘటనలు దేశంలో చాలానే ఉన్నాయి. ఇక కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆటగాళ్లు రాజకీయ నాయకులను కలవడం జరుగుతుంది. తాజాగా అలాంటి భేటీనే జరిగింది శనివారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు పాండ్యా బ్రదర్స్. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ కు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఎన్నికైన సంగతి మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
హార్దిక్ పాండ్యా.. టీమిండియా జట్టులో నిఖార్సైన ఆల్ రౌండర్ గా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అరంగేట్రంలోనే గుజరాత్ టైటాన్స్ కు ఐపీఎల్ కప్ ను అందించి వార్తల్లో నిలిచాడు. దాంతో ఒక్కసారిగా పాండ్యా పేరు క్రీడా ప్రపంచంలో మారుమ్రోగిపోయింది. ఇక ప్రస్తుతం శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ కు కెప్టెన్ గా పాండ్యాను ఎంపిక చేశారు. అయితే ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తాజాగా భేటీ అయ్యారు పాండ్యా బ్రదర్స్. అమిత్ షాతో దిగిన ఫోటోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు పాండ్యా. ఈ సందర్భంగా..”తనను ఆహ్వనించి ఆతిథ్యం అందించినందుకు ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాక్స్. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది” అంటూ రాసుకొచ్చాడు పాండ్యా. పాండ్యాతో పాటుగా సోదరుడు కృనాల్ పాండ్యా సైతం ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే పాండ్యా స్వస్థలం గుజరాత్ కావడంతోనే అమిత్ షా వారిని కలిసినట్లుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఈ ఫోటో చూసిన నెటిజన్లు.
Thank you for inviting us to spend invaluable time with you Honourable Home Minister Shri @AmitShah Ji. It was an honour and privilege to meet you. 😊 pic.twitter.com/KbDwF1gY5k
— hardik pandya (@hardikpandya7) December 31, 2022