ఓ అనామకుడిగా ఐపీఎల్ 2021లో కోలకతా నైట్ రైడర్స్ తరుపున అరంగ్రేటం చేసిన వెంకటేశ్ అయ్యర్.. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఇరగదీసి ఏడాదిలోపే జాతీయజట్టుకు ఆడే అవకాశం దక్కించుకున్నాడు. టీమిండియాకు కూడా అల్ రౌండర్ల కొరత ఎప్పుడు ఉండేదే. దీంతో మంచి అల్ రౌండర్ దొరికాడని అందరూ సంతోషించారు. కానీ, అది మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. గత ఏడాది బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ దుమ్మురేపిన అయ్యర్ ఈ ఏడాది మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. దీంతో జట్టులో స్థానమే కోల్పోయాడు. ఈ క్రమంలో అయ్యర్‌ని బెంచ్‌కే పరిమితం చేయడంపై భారత మాజీ క్రికెటర్ అజేయ జడేజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
వెంకటేశ్ అయ్యర్ మంచి టాలెంట్ ఉన్న ఆటగాడు. ఇలా నైపుణ్యమున్న యువ క్రికెటర్లను బెంచ్‌కు పరిమితం చేయడం ఏ మాత్రం సమంజసం కాదంటూ అజేయ జడేజా పేర్కొన్నాడు. ఆటగాడు ఎప్పుడూ ఫామ్‌లో ఉండాలంటే అది సాధ్యమయ్యే పని కాదని చెప్పుకొచ్చాడు. “కోహ్లీ, రోహిత్ లాంటి దిగ్గజ ఆటగాళ్లే అంచనాలకు తగ్గట్టుగా రాణించలేదు మరి వెంకటేశ్ అయ్యర్ ఎంతంటూ” అయ్యర్ ను వెనకేసుకొచ్చాడు.
KKR Players#IPL2022 #KKRvRR pic.twitter.com/SzAHc23St1
— RVCJ Media (@RVCJ_FB) May 2, 2022
ఇది కూడా చదవండి: Rinku Singh: పొట్టకూటి కోసం స్వీపర్‌గా పని చేసిన కేకేఆర్ యువ క్రికెటర్!
” జట్టు ఎంపిక గురించి ఎప్పుడూ చర్చ జరుగుతుండడం సహజం. ఏదో కొన్ని మ్యాచ్‌లు ఆడలేదని ఆటగాళ్లను పక్కనబెట్టడం మొదలుపెడితే.. భారత క్రికెట్ జట్టుకు మళ్లీ వెనక్కి వెళ్తుందనేది గుర్తుంచుకోవాలి. ఒకవేళ మనం ఆటగాళ్ల ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే గుజరాత్‌తో మ్యాచ్ ముందు వరకూ కోహ్లీ ఏం ఆడాడు.. రోహిత్ శర్మ కూడా అంతే. ప్రతీ మ్యాచ్ ఆడాలంటే అది అసాధ్యమే. నేను ఇదంతా ఇండియన్ క్రికెట్ కోణంలో చెబుతున్నాను. కోల్‌కతాకి దీనికి సంబంధం లేదు” అంటూ అజయ్ జడేజా అసహనం వ్యక్తం చేశాడు.
Sourav Ganguly backs Rohit Sharma & Virat Kohli to come good amid rough IPL 2022 form.
📸: IPL/BCCI#IPL2022 pic.twitter.com/wOxnIhmhmP
— CricTracker (@Cricketracker) April 29, 2022
ఈ సీజన్ లో వెంకటేష్ అయ్యర్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేదు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన వెంకటేశ్ అయ్యర్ ఒక హాఫ్ సెంచరీతో 132 పరుగులే చేయగలిగాడు. రోహిత్ 41 అత్యధిక స్కోర్‌తో 155, కోహ్లీ పది మ్యాచ్‌లలో ఒక అర్ధ శతకంతో 186 పరుగులు చేశాడు. కేకేఆర్ రిటైన్ చేసుకున్న నలుగురు ఆటగాళ్లలో వెంకటేశ్ అయ్యర్(రూ.8 కోట్లు), వరుణ్ చక్రవర్తి రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమయ్యారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా 4 మ్యాచుల్లో గెలిచి ఏడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే మిగిలిన 4 లీగ్ మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. మరి వెంకటేష్ అయ్యర్ ను బెంచ్‌కు పరిమితం చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Points table of IPL 2022. KKR moves to No.7 position in this table. pic.twitter.com/I3HGmQ9h0J
— CricketMAN2 (@ImTanujSingh) May 2, 2022
ఇది కూడా చదవండి: KKR vs RR: వీడియో: ప్రసిద్ కృష్ణ వెరైటీ త్రో.. వికెట్లకు కాకుండా బౌల్ట్ మీదకు!