ఐపీఎల్ 2022తోనే ఎంట్రీ ఇచ్చి ఛాంపియన్‌గా నిలిచింది గుజారాత్ టైటాన్స్. దీంతో తొలిసారి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న ఆ జట్టు కెప్టెన్ హార్థిక్ పాండ్యాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అలాగే పాండ్యా చిన్ననాటి కోచ్ జితేందర్ సింగ్ కూడా గుజరాత్ టైటాన్స్ విజయం సాధించడంపై స్పందిస్తూ.. ఆసక్తికర విషయాలు వెల్లడించారు. హార్థిక్ పాండ్యా భావోద్వేగపూరితమైన వ్యక్తని, అతని డ్రెస్స్, చైన్స్ చూసి తప్పుగా అర్థం చేసుకోవద్దన్నాడు. అతను చాలా మంచి మనస్సు ఉన్న వ్యక్తని చెప్పుకొచ్చాడు. కష్టాలు ఎదురైనప్పుడల్లా హార్దిక్ నేలకు కొట్టిన బంతిలా తిరిగొస్తాడని చెప్పాడు. కాఫీ విత్ కరణ్ షోలో చోటు చేసుకున్న వివాద సమయంలో హార్దిక్ చాలా బాధపడ్డాడని తెలిపాడు.
ఆ వివాదంతో నిషేధానికి గురైన అతను ఆ రాత్రి అంతా నిద్రపోలేదని తెలిపాడు. అయితే మైదానంలో చెమటలు కక్కిస్తే సెట్ అయ్యాడని చెప్పిన జితేందర్.. మళ్లీ ఇలా చెడ్డ పేరు తెచ్చుకోనని మాట ఇచ్చాడని గుర్తు చేసుకున్నాడు. అతని తండ్రి ఇప్పుడు ఉంటే చాలా సంతోషించేవాడని తెలిపాడు. ‘కాఫీ విత్ కరణ్ షోలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవడంతో హార్దిక్ పాండ్యాను బీసీసీఐ సస్పెండ్ చేసింది. దాంతో అతను తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఆ రాత్రంతా నిద్ర పోలేదు. ఈ విషయం తెలిసి నేను అతనితో మాట్లాడాను. టెన్షన్ పడవద్దని సూచించాను. అతి త్వరలోనే మళ్లీ టీమిండియాకు ఆడుతావని ఓదార్చాను. జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి పెద్దగా ఆలోచించకు వెంటనే రిలియన్స్ స్టేడియానికి రావాలని సూచించాను.
ఇక హార్దిక్ కోసం నేను బ్యాడ్మింటన్ కోర్ట్ బుక్ చేశాను. ఇద్దరం కలిసి చాలా సేపు ఆడాం. బ్యాడ్మింటన్ ఆడించి అతని చెమటలు కక్కెలా చేశాను. దాంతో అతను ఆ వివాదం నుంచి తేరుకున్నాడు. క్రీడల్లో ఉన్న మజా ఏంటో తెలుసుకున్నా. తాను పుట్టింది క్రీడాకారుడిగా రాణించేందుకే తప్పా చాట్ షోస్ కాదనే విషయాన్ని గ్రహించాడు. మళ్లీ తన గురించి నెగటివ్ కామెంట్స్ వినబడే అవకాశం ఇవ్వనని నాకు మాటిచ్చాడు. అతను తన మాటపై నిలబడ్డాడు. హార్దిక్ తండ్రి ఇప్పుడు ఉండి ఉంటే చాలా గర్వపడేవాడు.’ అని జితేందర్ చెప్పుకొచ్చాడు.
కాఫీ విత్ కరణ్’ షోలో హార్ధిక్ పాండ్యా లవ్‌స్టోరీ గురించి కరణ్ జోహార్ అడగ్గా.. తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని తాను చూసే విధానంపై అభ్యంతరకరంగా మాట్లాడాడు. రాహుల్ కూడా తన జేబులో కండోమ్ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి ‘ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావు’ అంటూ ప్రశంసించాడని వివాదాస్పదరీతిలో చెప్పుకొచ్చాడు. మహిళలను కించపరిచే విధంగా ఉన్న ఈ వ్యాఖ్యల పట్ల అప్పట్లో తీవ్ర దూమారం రేగింది. కుర్రాళ్లకు ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్లు ఇలా వ్యవహరించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దాంతో ఈ ఇద్దరి ఆటగాళ్లపై బీసీసీఐ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2022: రాజస్థాన్‌కు అవమానం.. గట్టి కౌంటరిచ్చిన సంజూ శాంసన్ భార్య చారులత!
AAPDE GT GAYA!
WE ARE THE #IPL Champions 2⃣0⃣2⃣2⃣!#SeasonOfFirsts | #AavaDe | #GTvRR | #IPLFinal pic.twitter.com/wy0ItSJ1Y3
— Gujarat Titans (@gujarat_titans) May 29, 2022