ఐపీఎల్ 2022లో బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్థిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జీటీ కెప్టెన్ హార్థిక్ పాండ్యా ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 87 పరుగులు చేసిన పాండ్యా.. బౌలింగ్‌లో కూడా ఒక వికెట్ పడగొట్టాడు. అలాగే అద్భుతమైన ఫీల్డింగ్‌తో రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను రనౌట్ చేశాడు.
జీటీ బౌలర్ ఫెర్గుసన్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో సంజూ మిడ్ ఆఫ్ వైపు షాట్ ఆడాడు. సింగిల్ కోసం ప్రయత్నించగా బుల్లెట్‌లా దూసుకొచ్చిన హర్థిక్ పాండ్యా మిడ్ ఆఫ్ నుంచి త్రో కొడితే డైరెక్ట్‌గా వికెట్లకు తగిలింది. ఆ సమయంలో సంజూ శాంసన్ అసలు ఫ్రేమ్‌లోనే లేడు. దీంతో 11 బంతుల్లో 11 పరుగులు చేసిన సంజూ పెవిలియన్ చేరాడు. కాగా.. హర్థిక్ పాండ్యా కొట్టిన త్రోకు వికెట్ ఇరిగిపోవడం వివేషం. మిడిల్ వికెట్ మధ్యకు విరిగింది. అంటే పాండ్యా ఎంత వేగంగా ఆ బాల్‌ను విసిరి ఉంటాడో ఊహించండి. విరిగి వికెట్‌ను మరో కొత్త వికెట్‌తో అంపైర్లు రిప్లేస్ చేశారు. దీంతో ఆట కొంత సేపు ఆగిపోయింది.బ్యాటింగ్‌లో బుల్లెట్ లాంటి భారీ సిక్సులు ఆడే పాండ్యా.. ఫీల్డింగ్‌లోనూ వికెట్లు విరగ్గొడతాడని అర్థం అయింది. ఈ ఐపీఎల్‌కి ముందు గాయం కారణంగా ఫామ్ లేమితో టీమిండియాలో స్థానంలో కోల్పోయిన పాండ్యా.. ఈ సీజన్‌లో మాత్రం అదరగొడుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో పాటు మంచి కెప్టెన్సీతో గుజరాత్ టైటాన్స్‌ను పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలబెట్టాడు. మరి పాండ్యా త్రోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్! రోహిత్ శర్మపై నిషేధం విధిస్తారా?
Hardik pandya Run out Sanju Samson and broken costly stump with lovely throw!
Hardik is now Orange Cap Holder now
Scored 87* not out ( man of the match) #GTvsRR #HardikPandya #IPL2022 pic.twitter.com/Qwdf4luXNb— Rahulsarsar (@Rahulsarsar177) April 14, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.