ఐపీఎల్ 2022లో బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ థ్రిల్లింగ్‌గా సాగింది. మ్యాచ్ చివరి ఓవర్ చివరి బంతి వరకు వెళ్లింది. దాదాపు అసాధ్యం అనుకున్న గెలుపును రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా తమ సూపర్ హిట్టింగ్‌తో సాధించి చూపించారు. చివరి ఓవర్లో 22 పరుగులు కావాల్సిన తరుణంలో రషీద్ ఖాన్, తెవాటియా రెచ్చిపోయారు.
మార్కో జన్‌సేన్ వేసిన చివరి ఓవర్ తొలి బంతికి రాహుల్ తెవాటియా లాంగ్ ఆన్‌లో సిక్సర్ బాదాడు. 2వ బంతికి సింగిల్ వచ్చింది. 3వ బంతికి రషీద్ క్రీజులోకి వచ్చాడు. ఆ బంతికి రషీద్ స్ట్రెయిట్ సిక్స్ బాదాడు. 4వ బంతికి డాట్ పడింది. ఇక 2 బంతుల్లో 9 పరుగులు కావాల్సిన తరుణంలో రషీద్ మ్యాజిక్ చేశాడు. 5వ బంతికి మార్కో జన్‌సేన్ ఫుల్ టాస్ వేయగా.. దాన్ని ఆఫ్ సైడ్ సిక్సర్‌గా మలిచాడు. చివరి బంతికి మూడు పరుగులు కావాల్సిన తరుణంలో షార్ట్ పిచ్ బంతి పడగా రషీద్ బ్యాట్‌కు ఎడ్జ్ అయ్యి బంతి నేరుగా బౌండరీ అవతల పడింది. దీంతో గుజరాత్ డగౌట్లో సంబరాలు మిన్నంటాయి.కాగా ఈ మ్యాచ్‌లో తొలుత సన్‌రైజర్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (65పరుగులు 42బంతుల్లో 6ఫోర్లు 3సిక్సర్లు), మార్కరమ్ (56పరుగులు 40బంతుల్లో 2ఫోర్లు 3సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. చివర్లో శశాంక్ సింగ్ (25పరుగులు 6బంతుల్లో 1ఫోర్, 3సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఇక ఛేదనకు దిగిన గుజరాత్ ఓపెనర్ సాహా (68 పరుగులు 38 బంతుల్లో 11 ఫోర్లు 1 సిక్సర్), శుభ్‌మన్ (22) రాణించగా.. చివర్లో రాహుల్ తెవాటియా (40 పరుగులు 21బంతుల్లో 4ఫోర్లు 2 సిక్సర్లు నాటౌట్), రషీద్ ఖాన్ (31 పరుగులు 11 బంతుల్లో 4సిక్సర్లు నాటౌట్ ) చెలరేగడంతో గుజరాత్ చివరి బంతికి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ IPLకి దూరం కానున్నాడా?
what a match !!!
Rashid Khan showed extraordinary finishing and extraordinary craftsmanship.
Congratulations !!#RashidKhan @BCCI @IPL pic.twitter.com/LV61YddumQ— 𝐌𝐑. 𝐌𝐎𝐍𝐈𝐑 𝐇𝐎𝐒𝐒𝐄𝐍 (𝐌𝐎𝐍𝐈𝐑)° (@MrMonirHossen) April 27, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.