ఐపీఎల్-2023లో ప్లేఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా కన్ఫర్మ్ చేసుకున్న ఫస్ట్ టీమ్‌గా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపుతో ఆ టీమ్ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయింది. అయితే కప్ రేసులో దూసుకెళ్తున్న గుజరాత్ జట్టులో ఏవో గొడవలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఐపీఎల్-2023లో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయిన ఫస్ట్ టీమ్‌గా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విక్టరీతో ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది టైటాన్స్. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 రన్స్ చేసింది. వృద్ధిమాన్ సాహా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగినప్పటికీ మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (101) సెంచరీతో చెలరేగాడు. గుజరాత్ జట్టు తరఫున సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. అతడికి తోడుగా సాయి సుదర్శన్ (47) కూడా రాణించడంతో గుజరాత్ 188 రన్స్ భారీ స్కోరు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లతో సత్తా చాటాడు. అయితే అతడికి మిగిలిన వారు సహకరించలేదు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు శుభారంభం దక్కలేదు.
సన్‌రైజర్స్ ఓపెనర్లు అన్మోల్ప్రీత్ సింగ్ (5), అభిషేక్ శర్మ (5) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. జట్టు సారథి ఎయిడెన్ మార్క్రమ్ (10), రాహుల్ త్రిపాఠీ (1) కూడా ఫెయిల్ అయ్యారు. స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (64) ఒక్కడే రాణించాడు. ఆఖర్లో భువనేశ్వర్ కుమార్ (27) మెరుపులు మెరిపించినప్పటికీ ఎస్ఆర్హెచ్ విజయానికి 34 రన్స్ దూరంలో ఉండిపోయింది. టైటాన్స్ బౌలర్లలో మహ్మద్ షమీ, మోహిత్ శర్మ తలో 4 వికెట్లతో అద్భుతంగా రాణించారు. అయితే కప్ రేసులో దూసుకెళ్తున్న టైటాన్స్ జట్టులో ఏవో గొడవలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సెంచరీ కొట్టి గుజరాత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు గిల్. అయితే అతడి హండ్రెడ్ పూర్తి కాగానే టీమ్ డగౌట్లో అందరూ లేచి చప్పట్లతో మెచ్చుకున్నారు.
గిల్ సెంచరీపై గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా మాత్రం పెద్దగా ఎమోషన్స్ చూపించలేదు. ఆ టైమ్‌లో ఆయన డగౌట్లో కూర్చొని కనిపించారు. ఆ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో సీరియస్‌గా ఏదో మాట్లాడుతూ కనిపించారు. బహుశా గిల్ సెంచరీ కొట్టినా జట్టు 200 పైచిలుకు స్కోరు చేయలేదనో ఫ్రస్ట్రేషనో లేదా శుబ్‌మన్ మరింత వేగంగా ఆడి ఉండాల్సిందని నెహ్రా భావించారేమో! మొత్తానికి గిల్ సెంచరీ బాదినా నెహ్రా అభినందించకపోవడం, ఆ సమయంలో హార్దిక్‌తో సీరియస్‌గా ఏదో మాట్లాడటం చూస్తుంటే జట్టులో ఏవో గొడవలు ఉన్నట్లే కనిపిస్తోందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. కప్ రేసులో దూసుకెళ్తున్న తరుణంలో ఇలాంటి వాతావరణం గుజరాత్‌కు ఏమాత్రం మంచిది కాదని చెబుతుననారు. మరి.. దీన్ని టీమ్ మేనేజ్మెంట్ గుర్తించి త్వరగా పరిష్కరిస్తుందేమో చూడాలి.
Ashish Nehra is highly angry that he is not listening to Hardik Pandya. This is Ashish Nehra for you.#GTvsSRH #SRHvsGT pic.twitter.com/X2zEZqzQrc
— Vikram Rajput (@iVikramRajput) May 15, 2023