ప్రస్తుతం అమెరికాలో మేజర్ క్రికెట్ లీగ్ జరుగుతుంది. ఇందులో భాగంగా సన్ రైజర్స్ బ్యాటర్ ఒక్క ఓవర్లోనే 26 పరుగులు రాబట్టి రషీద్ కి పీడకలలా మారాడు.
ప్రపంచంలోని అగ్ర స్పిన్నర్లలో రషీద్ ఖాన్ ఒకడు. ఈ మిస్టరీ స్పిన్నర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రషీద్ బౌలింగ్ కి వచ్చాడంటే వికెట్ పక్కా అనుకోవాల్సిందే. అలా కానిచో పొదుపుగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేస్తాడు. సంవత్సరాలు గడుస్తున్నా.. రషీద్ ఖాన్ బౌలింగ్ ని ఎవరు డీ కోడ్ చేయలేకపోతున్నారు. దీంతో లీగ్ ఏదైనా ప్రత్యర్థుల పాలిట కొరకరాని కొయ్యలా మారాడు ఈ ఆఫ్ఘనిస్తాన్ సంచలనం. అయితే ఇప్పుడు సన్ రైజర్స్ బ్యాటర్ హెన్రీచ్ క్లాసెన్ మాత్రం రషీద్ ఖాన్ బౌలింగ్ లో వీర విహారం చేసాడు. ఒక్క ఓవర్లోనే 26 పరుగులు రాబట్టి రషీద్ కి పీడకలలా మారాడు. వరుసపెట్టి బౌండరీల మోత మోగిస్తూ ఈ లెగ్ స్పిన్నర్ మీద పూర్తి ఆధిపత్యం చూపించాడు.
ప్రస్తుతం అమెరికాలో మేజర్ క్రికెట్ లీగ్ జరుగుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 194 పరుగులు చేసింది. ముంబై ఇన్నింగ్స్ లో స్టార్ బ్యాటర్ నికోలస్ పూరణ్ మెరుపు హాఫ్ సెంచరీ (34 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 68)కి తోడు కీరన్ పొలార్డ్(18 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 34) కూడా బ్యాట్ ఝళిపించాడు. ఇక లక్ష్య ఛేదనలో ఎంఐ బౌలర్లకు చుక్కలు చూపించాడు క్లాసెన్. 44 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 110 పరుగులతో ఒంటి చేత్తో జట్టుకి విజయాన్ని అందించాడు.క్లాసెన్ విధ్వంసంతో సీయాటెల్ టీమ్ 2 వికెట్ల తేడాతో ఎంఐ న్యూయార్క్‌ను ఓడించింది. దీంతో మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో తొలి సెంచరీ నమోదు చేసిన క్లాసెన్.. పలు రికార్డులను సృష్టించాడు. ఇక ముంబై న్యూయార్క్ స్టార్ స్పిన్నర్, అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్‌కు క్లాసెన్ వేసిన 16వ ఓవర్‌లో వరుసగా 6, 6, 2, 4, 6, 2 మూడు సిక్స్‌లు, ఓ బౌండరీతో 26 పరుగులు రాబట్టాడు.
సాధారణంగా రషీద్ ఖాన్ బౌలింగ్ కే వస్తే ఎంత స్టార్ బ్యాటర్ అయినా ఆచి తూచి ఆడతాడు. కానీ క్లాసెన్ కి మాత్రం అదేం పట్టలేదు. బౌలర్ ఎవరైనా బౌండరీ దాటించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. రషీద్ వేసిన ఈ ఒక్క ఓవరే మ్యాచ్ ని మలుపు తిప్పింది. ఎన్నోసార్లు తన బౌలింగ్ తో మ్యాచ్ ని మలుపు తిప్పిన రషీద్ ఈ సారి మాత్రం ప్రత్యర్థి వైపు మలుపు తిప్పాడు. ప్రస్తుతం రషీద్ 26 పరుగులు సమర్పించుకున్న వీడియో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. క్లాసెన్ ఆడిన ఈ ఇన్నింగ్స్ తో సన్ రైజర్స్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో కూడా క్లాసెన్ కొన్ని మెరుపు ఇన్నింగ్స్ లు ఆడిన సంగతి తెలిసిందే. క్లాసెన్ ఫామ్ ఇలాగే కంటిన్యూ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి క్లాసెన్ రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఆడిన ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
HEINRICH KLAASEN IS TAKING ON EVERYBODY!
Heinrich Klaasen BLASTS 3 SIXES against Rashid Khan!
1⃣6⃣6⃣/4⃣ (15.5) pic.twitter.com/nYJQrnXh06
— Major League Cricket (@MLCricket) July 26, 2023