నిన్న జరిగిన ఐపీఎల్ లో తనలోని బౌలింగ్ స్కిల్ తో పాటుగా బ్యాటింగ్ లో మరో కోణాన్ని చూపించాడు రషీద్ ఖాన్ . ఈ మ్యాచులో నాలుగు వికెట్లు తీయడంతో పాటు.. 32 బంతుల్లోనే 79 పరుగులు చేసాడు. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ జట్టు ఫ్యాన్స్ రషీద్ ని ఎందుకు వదులుకున్నారని మండిపడుతుండగా.. తాజాగా రషీద్ ఖాన్ విషయంలో ఒక కొత్త నిజం బయటకు వచ్చింది.
“రషీద్ ఖాన్” ఈ పేరు టీ 20ల్లో ఒక సంచలనం. బ్యాటర్ ఎవరైనా రషీద్ బౌలింగ్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఏళ్ళు గడిచినా.. రషీద్ స్పిన్ మాయాజాలాన్ని ఎవ్వరూ డీ కోడ్ చేయలేకపోతున్నారు. బౌలింగ్ లో ఫ్లిప్పర్, స్లైడర్, దూస్రా, వంటి బంతులు వేయడం రషీద్ కే సాధ్యం. ఏ దేశంలో లీగ్ జరిగినా.. ఎంత విధ్వంసకర బ్యాటర్ అయినా రషీద్ ఖాన్ ముందు తలొంచాల్సిందే. ఇదంతా అందరికీ తెలిసినప్పటికీ.. రషీద్ ఖాన్ బ్యాటింగ్ లో కూడా మెరుపులు మెరిపిస్తాడని చాలా కొద్ది మందికే తెలుసు. నిన్న ఐపీఎల్ లో తనలోని బౌలింగ్ స్కిల్ తో పాటుగా బ్యాటింగ్ లో మరో కోణాన్ని చూపించడం విశేషం. ఈ మ్యాచులో నాలుగు వికెట్లు తీయడంతో పాటు.. 32 బంతుల్లోనే 79 పరుగులు చేసాడు. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ జట్టు ఫ్యాన్స్ రషీద్ ని ఎందుకు వదులుకున్నారని మండిపడుతుండగా.. తాజాగా రషీద్ ఖాన్ విషయంలో ఒక కొత్త నిజం బయటకు వచ్చింది.
రషీద్ ఖాన్ సన్ రైజర్స్ ద్వారానే ఐపీఎల్ లో అడుగుపెట్టాడు. 2017 లో 4 కోట్లు పెట్టి కొనుకున్న హ్యద్రాబాద్ టీమ్.. ఆ తర్వాత 2018 లో ఆర్టియం ద్వారా దక్కించుకుంది. ఇక అప్పటినుంచి జట్టులో తిరుగులేని ఆటగాడిగా నిలిచాడు. ఇదిలా ఉండగా 2022 లో మరో రెండు కొత్త జట్లను ఐపీఎల్ కి తెచ్చే ప్రయత్నంలో ఒక్కో జట్టు గరిష్టంగా నలుగురిని మాత్రమే ఉంచుకోవాలని అనే ప్రతిపాదన తీసుకొచ్చింది. దీని ప్రకారం మొదట ఎంచుకునే ప్లేయర్ కి 16 కోట్లు, ఆ తర్వాత 12,8,6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో న్యూజీలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియంసన్ మొదటి ప్రాధాన్యత ఆటగాడిగా.. రషీద్ ని రెండో ప్రాధాన్యతగా సన్ రైజర్స్ యాజమాన్యం భావించింది.
రెండో ఆటగాడిగా రిటైన్ చేసుకోవడం రషీద్ కి నచ్చలేదు. తనని మొదటి ప్లేయర్ గానే రిటైన్ చేసుకోవాలని డిమాండ్ చేసాడు. ఒక బౌలర్ కోసం అంత మొత్తంలో డబ్బు ఇవ్వడం ఇష్టం లేదని భావించిన సన్ రైజర్స్.. చాలా సున్నితంగానే అతన్ని తరస్కరించింది. దీంతో సం రైజర్స్ ఈ స్పిన్నర్ ని వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఇది రషీద్ సొంత నిర్ణయం కాదని.. అతన్ని ఇంగ్లాండ్ ఏజెంట్ ఒకరు కలిసి తన మార్కెట్ ఏంటో చెప్పి సన్ రైజర్స్ నుంచి దూరం చేస్తున్నాడనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ కారణంగానే రషీద్ సన్ రైజర్స్ కి దూరమయ్యాడనే వార్తలు వస్తున్నాయి. అయితే రషీద్ ని మొదటి రిటైన్ గా తీసుకొని.. వేలంలో విలియమ్సన్ ని దక్కించుకుంటే బాగుండేదని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి రషీద్ సన్ రైజర్స్ నుండి అలా దూరమవ్వాల్సి వచ్చిందని చెప్పుకొస్తున్నారు. 2022 లో రషీద్ ని వదిలేసుకొని భారీ మూల్యం చెల్లించుకున్న సన్ రైజర్స్.. ఈ సీజన్ లో విలియంసన్ ని కూడా వదిలేసుకొని పెద్ద తప్పే చేసింది. వీరిద్దరిని జాగ్రత్తగా కాపాడుకుంటే ప్రస్తుతం సన్ రైజర్స్ పరిస్థితి మరోలా ఉండేది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
It has been a wonderful journey with the @sunrisershyd 🧡
Thank you for your support, love and for believing in me 🙏
To the #OrangeArmy you’ve been my pillar of strength and I shall forever be grateful for such wonderful fans 🧡🙏 pic.twitter.com/1yIx1oVKXO
— Rashid Khan (@rashidkhan_19) December 1, 2021