రషీద్ ఖాన్ ఒకటే ఇన్నింగ్స్ తో ఐదు సరికొత్త రికార్డులు సృష్టించాడు. అయితే అది ముంబయి లాంటి తోపు జట్టుపై చేయడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకీ రషీద్ సెట్ చేసిన ఆ రికార్డులు ఏంటి?
రషీద్ ఖాన్ గురించి చెప్పుకోవడానికి కొత్తగాం ఏం లేదు. తన స్పిన్ మ్యాజిక్ తో దాదాపు స్టార్ బ్యాటర్స్ అందరినీ ముప్పతిప్పలు పెట్టాడు. ఇప్పటికీ పెడుతూనే ఉన్నాడు. అందరికీ రషీద్ పేరు చెప్పగానే స్పిన్ బౌలింగ్ గుర్తొస్తుంది. కానీ తనలో అద్భుతమైన బ్యాటర్ ఉన్నాడని క్రికెట్ బాగా చూసేవాళ్లకు తెలుసు. ఐపీఎల్ లో సరైన ఇన్నింగ్స్ లు పడలేదు గానీ బిగ్ బాష్ లాంటి లీగ్స్ లో ఆల్రెడీ ఇది ప్రూవ్ చేశాడు. తాజాగా ముంబయితో మ్యాచ్ లో ఆ సీన్ రిపీట్ చేశాడు. కానీ గుజరాత్ టీమ్ విజయం సాధించలేకపోయింది. అయితేనేం ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో ఏకంగా ఐదు సరికొత్త రికార్డులని రషీద్ నమోదు చేయడం విశేషం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సన్ రైజర్స్ టీమ్ లో తొలుత ఆడాడు. గతేడాది గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్ తో కనెక్షన్ కట్ చేసుకుని గుజరాత్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పటికప్పుడు తన మార్క్ చూపిస్తూనే ఉన్నాడు. ఈ టీమ్ తరఫున ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లో పక్కనబెడితే.. తాజాగా ముంబయి ఇండియన్స్ పై రషీద్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం వేరే లెవల్. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి.. సూర్య సెంచరీ వల్ల 218/5 స్కోరు చేసింది. ఛేదనలో గుజరాత్ ఓ దశలో 103/8 తో ఉంది. దీంతో మ్యాచ్ ఓడిపోయినట్లే అనుకున్నారు.
అలాంటి టైంలో రషీద్ ఖాన్ తన బ్యాటుతో బీభత్సం సృష్టించాడు. 32 బంతుల్లో 79 రన్స్ కొట్టి ఆల్మోస్ట్ గుజరాత్ ని గెలిపించినంత పనిచేశాడు. కానీ 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇందులో గెలుపోటముల సంగతి పక్కనబెడితే రషీద్ బ్యాటింగ్ దెబ్బకు ఐదు రికార్డులు వచ్చి చేరాయి. ఐపీఎల్ లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కి దిగి హాఫ్ సెంచరీ (79*) చేసిన లిస్ట్ లో రషీద్ టాప్ లోకి వెళ్లిపోయాడు. ఒకే ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ ప్లస్ నాలుగు వికెట్లు తీసిన మూడో క్రికెటర్ గా రషీద్ ఘనత సాధించాడు. గుజరాత్ తరఫున ఓ ఇన్నింగ్స్ లో ఎక్కువ సిక్సులు (10) కొట్టిన ప్లేయర్ గా రషీద్ రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ లోని ఛేదనలో అత్యధిక సిక్సులు (10) కొట్టిన వారిలో రషీద్ రెండో స్థానంలోకి వచ్చేశాడు. ఆలోవర్ టీ20 క్రికెట్ లో తొమ్మిది వికెట్ కు ఎక్కువ పరుగులు(88*) చేసిన జోడీగా రషీద్-అల్జారీ జోసెఫ్ నిలిచారు. ఇలా ఒక్క దెబ్బకు ఐదు సరికొత్త రికార్డులు సొంతం చేసుకోవడం కేవలం రషీద్ ఖాన్ కి మాత్రమే సాధ్యమైంది. మరి రషీద్ మాస్ బ్యాటింగ్, రికార్డులు క్రియేట్ చేయడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Rashid Khan showing off his all-round skills! 🫣#IPL2023 #MIvsGT #RashidKhan pic.twitter.com/u6IuRx9itp
— OneCricket (@OneCricketApp) May 12, 2023