ఐపీఎల్ 2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచులో అరుదైన ఘటన చోటు చేసుకుంది. బౌలర్ తప్పిదం లేకుండానే ఓ బంతిని థర్డ్ అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. వికెట్ల వెనుకాల వికెట్ కీపర్ అత్యుత్సాహం కారణంగా థర్డ్ అంపైర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయంపై ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరలవుతోంది.
గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేస్తుండగా.. షెహ్‌బాజ్ అహ్మద్ వేసిన 9 ఓవర్ నాలుగో బంతిని శుభ్‌మన్ గిల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ కు తగలకుండా కీపర్ చేతిలో పడింది. క్యాచ్ కోసం వికెట్ కీపర్ అనూజ్ రావత్ అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. వెంటనే గిల్ రివ్యూ కోరాడు. అల్ట్రా ఎడ్జ్‌లో బ్యాట్‌కు తాకలేదని తేల్చిన థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవరించాడు. అంతేకాకుండా వికెట్ కీపర్ స్టంప్స్‌కు ముందే బంతిని అందుకున్నాడని గుర్తించి నోబాల్ ప్రకటించాడు. ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన విరాట్.. అంపైర్‌తో వాదించాడు. కానీ అంపైర్లు నిబంధనలు చెప్పడంతో సైలెంట్ అయిపోయాడు. కోహ్లీ అంపైర్లతో వాగ్వాదానికి ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Jab Aap Review Lete Ho Not Out Ke Liye Aur Mil Jaye No Ball Iss Cheez ka to alag hi mja hai. See Virat Reaction 😂 Totally Pissed Off 😂😂 @imVkohli #IPL2022 #viratkholi #kingkohli #rcbvsgt pic.twitter.com/905KilhANA
— Naman Kundra (@naman_kundra) April 30, 2022
Saare pahadi is season naam kharaab kar rahe hain. @RishabhPant17 with that ridiculous show against RR and now this by @AnujRawat_1755 . Kidhar collect kar raha hai bhai? #GTvRCB #RCBvGT #IPL2022 pic.twitter.com/Zyr8wTJ2Jq
— Mr. Cricket (@keerkit) April 30, 2022
ఇది కూడా చదవండి: Virat Kohli: వీడియో వైరల్ : హాఫ్ సెంచరీతో కమ్ బ్యాక్ ఇచ్చిన కోహ్లీ! కానీ..!
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 58), రజత్ పటిదార్(32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 4 వికెట్లు కోల్పోయి 3 బంతులు మిగిలిఉండగానే లక్ష్యాన్ని చేధించింది.
Finally King Kohli is back,This is not a only half century,It’s a comeback inning by #ViratKohli , Wait for More 🥰#RCBvsGT pic.twitter.com/GmwEa1KvgE
— Amazing facts ® (@Currentaffa296) April 30, 2022
Aapde GT gaya 😁#AavaDe #GTvRCB #SeasonOfFirsts pic.twitter.com/66yMc0BlMy
— Gujarat Titans (@gujarat_titans) April 30, 2022