ఐపీఎల్ 2022లో బుధవారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. కాగా పంజాబ్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అర్షదీప్ సింగ్ రనౌట్ అయిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రొఫెషనల్ క్రికెట్‌లో బ్యాటర్లు ఇంత అలసత్వంగా ఉంటారా? అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో చివరి బంతిని అర్షదీప్ సింగ్ (17 బంతుల్లో 2ఫోర్లతో 9) భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ముస్తాఫిజుర్ వైడ్ యార్కర్ వేయడంతో అర్షదీప్ బంతిని టచ్ చేయలేకపోయాడు.
సాధారణంగా ఐపీఎల్‌లో ఆఖరి బంతిని బ్యాటర్ సరిగా కనెక్ట్ చేయకపోయినా.. సింగిల్ కోసం ప్రయత్నిస్తుంటారు. దాంతో.. వారిని రనౌట్ చేసేందుకు వికెట్ కీపర్ ఆఖరి బంతికి ముందే ఒక గ్లోవ్ తీసేస్తుంటారు. కానీ.. పంజాబ్‌తో మ్యాచ్‌లో రిషభ్ పంత్ ఆ పని చేయలేదు. అర్షదీప్ సింగ్ సింగిల్ కోసం ప్రయత్నించినా.. వైభవ్ అరోరా స్పందించలేదు. దాంతో పిచ్ మధ్యలోకి వచ్చిన అర్షదీప్.. వైభవ్ అరోరా స్పందించకపోవడంతో నెమ్మదిగా నడుచుకుంటూ ముందుకు వెళ్లాడు. మరోవైపు పంత్ బంతిని అందుకుని.. రనౌట్ కోసం వస్తున్నా.. అర్షదీప్ సింగ్ వెనక్కి వెళ్లేందుకు ఇష్టపడలేదు. అలానే ముందుకు వచ్చి పిచ్ మధ్యలో వైభవ్ అరోరాతో మాట్లాడుతూ కనిపించాడు. దాంతో.. రిషభ్ పంత్ తన పని తాను కనించాడు. ఈ రనౌట్‌తో పంజాబ్ కింగ్స్ 115 పరుగులకు ఆలౌటైంది. రన్ తీయకుండా.. మాట్లాడుకుంటూ నిదానంగా నడిస్తే.. పంత్ చూస్తూ ఉంటాడా అంటే ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పంజాబ్‌ను చిత్తు చేసిన ఢిల్లీ! IPLలో రెండో బ్యాట్స్‌మెన్‌గా వార్నర్
Someone please define this pic.twitter.com/cXLlrCUCsY
— ChaiBiscuit (@Biscuit8Chai) April 20, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.