ఐపీఎల్ 2023 సీజన్ ఎంతో జోరుగా సాగుతోంది. గ్రూప్ దశ నుంచి ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఈ ఏడాది తమ అభిమాన జట్టేకప్పు కొడుతుంది అంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సీజన్ లో చాలా మంది స్టార్ ప్లేయర్లు పాల్గొనలేదు. ఎవరు పాల్గొనలేదు.. వాళ్లు ఎందుకు తప్పుకున్నారో మరోసారి చూద్దాం.
ఐపీఎల్ లీగ్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎప్పటిలాగానే ఈ సీజన్ కూడా ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటికే గ్రూప్ దశ ముగించుకుని ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఈసారి కప్పు ఎవరు కొడతారు? అంటూ ఇప్పటి నుంచే ఊహాగానాలు, ఆశలు వెల్లిబుచ్చుతున్నారు. తమ అభిమాన ప్లేయర్ రాణించాలని, తాము అభిమానించే జట్టు విజయం సాధించాలంటూ కోరుకోవడం సహజమే. అయితే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ ప్లేయర్లు ఈ సీజన్ కు దూరమైన విషయం తెలిసిందే. అయితే ఎవరెవరు ఈ సీజన్ కు దూరమయ్యారు? ఎందుకు దూరమయ్యారో తెలుసుకుందాం?
అంతర్జాతీయ క్రికెట్ మాత్రమే కాదు.. ఐపీఎల్ లో కూడా బుమ్రాకు ఎంతో క్రేజ్ ఉంది. ఈ యంగ్ పేసర్ బంతి అందుకుంటే వికెట్ ఖాయం అని అందరికీ తెలుసు. ముఖ్యంగా డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ గా పేరు పొందాడు. అలాంటి బుమ్రా ఈ ఏడాది ఐపీఎల్ కు దూరం అయ్యాడు. వెన్నుముక సర్జరీ జరిగిన కారణంగానే జాస్ప్రిత్ బుమ్రా ఈ ఐపీఎల్ సీజన్ ఆడలేదని అందరికీ తెలిసిందే. ఒక్క బుమ్రానే కాదు.. ఇంకా కొంతమంది దేశీయ స్టార్లు ఈ సీజన్ కు దూరమయ్యారు. శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(కారు ప్రమాదం), పటిదార్ వంటి స్టార్లు గాయాల కారణంగానే ఈ ఏడాది ధనాధన్ లీగ్ కు దూరమయ్యారు. వీరు లీగ్ లో లేకపోవడం ఎంతో మందిని నిరాశ చెందేలా చేసింది.
దేశీయ స్టార్లు మాత్రమే కాదు.. ఈ ఏడాది అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా చాలా మంది లీగ్ కు దూరమయ్యారు. ముఖ్యంగా విలిమ్సన్, బెన్ స్టోక్స్ ఆడేందుకు వచ్చి గాయాల పాలవడం వల్ల లీగ్ నుంచి తప్పుకున్నారు. బెయిర్ స్టో అయితే గతేడాది గాయాల నుంచి ఇంకా కోలుకోలేదనే కారణంగా సీజన్ లో పాల్గొనలేదు. ఇంక షకీబ్ అల్ హసన్ అయితే అంతర్జాతీయ ఎంగేజ్మెంట్స్, వ్యక్తిగత కారణాల రీత్యా ఈ ఏడాది దూరమయ్యాడు. డేవిడ్ మలన్ ను అయితే కొనుగోలు చేయలేదు. ఇంక స్మిత్ విషయానికి వస్తే.. ఈ ఏడాది అసలు ఆక్షన్ లో తన పేరుని రిజిస్టర్ చేసుకోలేదు. ఇలా గాయాలు, వ్యక్తిగత కారణాల రీత్యా కొందరు స్టార్ ప్లేయర్లు ఈ సీజన్ కు దూరమయ్యారు. వీరు లీగ్ లో లేకపోవడంతో వారి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ 10 స్టార్ ప్లేయర్లలో ఎవరు లీగ్ లో ఆడుంటే బాగుండేది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.