ఐపీఎల్ 2022 సీజన్.. ముంబై ఇండియన్స్ ఏ మాత్రం కలిసి రావట్లేదు. ఐపీఎల్ టోర్నీలో రికార్డు స్థాయిలో ఐదు టైటిళ్లను కైవసం చేసుకున్న ముంబై జట్టు.. ఈ ఏడాది మొదటి విజయం కోసం ఎదురుచూసే ధీన స్థితికి చేరింది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లల్లో ఒక్కదాంట్లోనూ గెలవలేదు. ఆరుకు ఆరూ ఓడి.. పాయింట్ల పట్టికలో అట్టుడుగున ఉంది. ముంబై ఇండియన్స్.. తన తరువాతి మ్యాచ్‌లో తనలాగే అధ్వాన్నంగా ఆడుతోన్న మరో ఛాంపియన్ టీం చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో జట్టులో పలు మార్పులు చేర్పులు చేయాలని ముంబై యాజమాన్యం భావిస్తోందట. అందులో భాగంగా.. టీమిండియా బౌలర్ ధవల్ కులకర్ణిని జట్టులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది మెగా వేలంలో అన్‌సోల్డ్ ఆటగాడిగా మిగిలిపోయిన 33 ఏళ్ల ధవల్ కులకర్ణి ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో హిందీ కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు. రేపో, మాపో- అతను ముంబై ఇండియన్స్ జట్టుతో కలవడం ఖాయంగా కనిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై జరిగే మ్యాచ్ ఆరంభం అయ్యే సమయానికి ధవల్ కులకర్ణి అందుబాటులో ఉండకపోవచ్చు గానీ.. ఆ తరువాతి గేమ్స్‌కు తుదిజట్టులో స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయి. 2020లో 75 లక్షల రూపాయలకు ముంబై ఇండియన్స్ అతణ్ని జట్టులోకి తీసుకుంది. ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు.
From on field Cricket Chemistry to off field Commentary !!
Thank you for the support @IrfanPathan @ImRaina @jatinsapru @cricketaakash @StarSportsIndia pic.twitter.com/9hm13XUtOP
— Dhawal Kulkarni (@dhawal_kulkarni) March 28, 2022
ఇది కూడా చదవండి: ఆరోసారి వచ్చారు.. ఓడారు.. రిపీట్!
ఐపీఎల్ లీగ్ దశ మ్యాచ్‌లన్నీ ముంబై, పూణేల్లో జరుగుతుండటంతో స్థానిక ఆటగాడిగా కులకర్ణి.. తమ జట్టును గట్టెక్కిస్తాయని ముంబై సారధి అంచనా వేస్తున్నాడు. కులకర్ణికి ముంబైలోని వాంఖడే, బ్రబోర్న్, డీవై పాటిల్ మైదానాలతో పాటు పూణేలోని ఎంసీఏ స్టేడియంలోని పిచ్‌లపై పూర్తి అవగాహన ఉండటంతో రోహిత్ అతనిని ఎలాగైనా జట్టులో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కులకర్ణి జట్టులో చేరితే ముంబై ఇండియన్స్ తిరిగి గాడిలో పడుతుందని రోహిత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
RCB in 2017 – Won only 3 matches out of 14 🤡
RCB in 2019 – Lost First 6 Matches in IPL 🤡
And their fans are trolling five times champions @mipaltan #IPL2022 #IPL #MumbaiIndians #RohitSharma𓃵 #RCB pic.twitter.com/QWnlfeNZs5
— ☠️ Proton ☠️ ( मानसिक दबावात ) (@ProtonTanmay) April 14, 2022
On this day in 2008,
Mumbai Indians played their 1st match and the rest is history…….💙
5 IPL trophies + 2 CL trophies@mipaltan #MumbaiIndians #OneFamily pic.twitter.com/P9tq21wOA2— Bardi C (@shyhoonbae) April 20, 2022
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 92 మ్యాచ్‌లు ఆడిన కులకర్ణి 86 వికెట్లు పడగొట్టాడు. అతను గతంలో ముంబై ఇండియన్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. కులకర్ణి టీమిండియా తరఫున 12 వన్డేలు, 2 టీ20లు ఆడి 22 వికెట్లు పడగొట్టాడు. అతని రాక ఎంత వరకు ముంబై ఇండియన్స్ తలరాతను మార్చుతుంధో చూడాలి. ఈ వెటరన్ క్రికెటర్ ను జట్టులోకి తీసుకుంటే.. ముంబై ఇండియన్స్ రాత ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
You ain’t missing the 🎯 if your name is 𝔸ℝ𝕁𝕌ℕ! 😎#OneFamily #DilKholKe #MumbaiIndians MI TV pic.twitter.com/P5eTfp47mG
— Mumbai Indians (@mipaltan) April 20, 2022
ఇది కూడా చదవండి: బరిలోకి అర్జున్ టెండూల్కర్! ముంబై రాత మారేనా?