ఐపీఎల్ 2022లో శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు చిత్తుగా ఓడింది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. 200పై చిలుకు లక్ష్యఛేదనను ఆర్సీబీ ధాటిగా ఆరంభించింది. ఈ సీజన్‌లో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. సూపర్ కవర్ డ్రై, ఒక స్టన్నింగ్స్‌తో టచ్‌లోకి వచ్చి కనిపించడంతో ఇక విజయం ఆర్సీబీదే అంత ఫిక్స్ అయ్యాడు. 3 ఓవర్లలోనే జట్టు స్కోర్ 30 పరుగులు దాటింది. కానీ.. ఏమైందో తెలియదు కానీ.. వెంటవెంటనే వికెట్లు కోల్పోయి.. ఒక్కసారిగా చతికిల పడింది.
ఇలా ఆర్సీబీ ఉన్నపళంగా దెబ్బతినడానికి ఒక నల్లపిల్ల కారణమని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే తొలి ఓవర్‌లో ఒక నల్లపిల్లి వచ్చి.. సైట్‌స్క్రీన్‌పై దర్జాగా కూర్చోని ఉంది. ఆ సమయంలో ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ స్ట్రైక్‌లో ఉన్నాడు. సైట్ స్క్రీన్ వద్ద కొద్ది కదలికలు ఉన్నా కూడా.. బ్యాటర్ ఏకాగ్రతను కోల్పోతాడు. డుప్లెసిస్ కూడా పిల్లి కారణంగా తన కాన్సట్రేషన్ తప్పడంతో.. అంపైర్‌కు ఆ విషయం చెబుతాడు. దాంతో ఆ పిల్లిని గ్రౌండ్ సిబ్బంది అక్కడి నుంచి తరిమేస్తారు. ఆ తర్వాత ఆట కొనసాగింది.
నాలుగో ఓవర్‌లో విరాట్ కోహ్లీ వికెట్‌తో నుంచి ఆర్సీబీ పతనం ప్రారంభం అవుతుంది. చివరికి లక్ష్యానికి 54 పరుగుల దూరంలో ఆర్సీబీ నిలిచిపోయి మ్యాచ్ ఓడిపోతుంది. ఇలా ఒక పిల్లి ఎదురు అవ్వడంతో శకునం బాగాలేకే ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో ఓడిపోయిందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. పైగా నల్లపిల్లి కావడంతోనే ఇలాంటి దారుణమైన ఓటమి ఎదురైందని అంటున్నారు. నల్ల పిల్లిని అపశకునానికి చిహ్నాంగా కొంత మంది విశ్వసిస్తారు. ఒక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్(42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70), జానీ బెయిర్ స్టో(29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు.
ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లు తీయగా.. హసరంగా రెండు వికెట్లు పడగొట్టాడు. షెహ్‌బాజ్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. గ్లేన్ మ్యాక్స్‌వెల్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 35) మినహా అంతా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడా మూడు వికెట్లు తీయగా.. రిషి ధావన్, రాహుల్ చాహర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్‌ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్‌కు తలో వికెట్ దక్కింది. మరి ఈ మ్యాచ్‌లో నల్ల పిల్లి పాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Faf du Plessis: కోహ్లీ ఎలా ఆడిన అవుట్ అవుతున్నాడు: డుప్లెసిస్
— Varma Fan (@VarmaFan1) May 13, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.