నాణ్యమైన క్రికెటర్లకు భారత్ లో కొదవలేదు. ఇది అన్ని దేశాల క్రికెటర్లు చెపుతున్న మాటే. కాకుంటే.. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంది. ‘విరాట్ కోహ్లీ100 సెంచరీలు సాధించి సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడని’ రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయాబ్ అక్తర్ అభిప్రాయపడుతున్నాడు. మరోవైపు.. ‘క్రికెట్ ప్రపంచాన్ని ఏలేది సూర్య కుమార్ యాదవంటూ..’ ఆస్ట్రేలియా మాజీ సారధి రికీ పాంటింగ్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. తాజాగా, టీమిండియా మాజీ క్రికెటర్ రోహన్ గవాస్కర్.. క్రికెట్ ప్రపంచాన్ని ఏలేది వీరిద్దరూ కాదంటూ.. ఓ యువ క్రికెటర్ పేరు సుంచించాడు. అందుకు తగ్గట్టుగా ఆ యువ క్రికెటర్ ప్రతి మ్యాచులోనూ రాణిస్తున్నాడు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
రోహన్ గవాస్కర్ అంతలా పొగుడుతున్న ఆ యువ క్రికెటర్ ఎవరో కాదు.. శుభ్ మాన్ గిల్. 2018 వరకు దేశవాళీ మ్యాచులకే పరిమితమైన గిల్ ఆ తరువాత మెల్లగా జాతీయ టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్టు ఆరంగ్రేటం చేసిన శుబ్‌మన్ గిల్, 3 టెస్టుల్లో 51.80 సగటుతో 259 పరుగులు చేశాడు. ఆపై.. గబ్బా టెస్టులో రిషబ్ పంత్ 89 పరుగులతో క్రెడిట్ మొత్తం కొట్టేసినా.. గిల్ చేసిన 91 పరుగులు వెలకట్టలేనివి. కాకుంటే.. ఐపీఎల్ 2021 సీజన్ వరకూ టీ20లను కూడా టెస్టుల్లానే ఆడతాడంటూ గిల్ స్ట్రైక్ రేట్ పై పెద్ద చర్చ నడిచేది. అయితే.. ఐపీఎల్ 2022 సీజన్ లో అందరి అంచనాలను తప్పని నిరూపించాడు.16 మ్యాచుల్లో 483 పరుగులు చేసి గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక్కడ నిలకడగా రాణించడమే కాకుండా.. తన స్ట్రైక్ రేటుతో కూడా అందరిని ఆశ్చర్యపరిచాడు.
#ShubmanGill is more than capable of holding his own in white-ball cricket: Rohan Gavaskar
Read: https://t.co/mAXtKkNe1t@ShubmanGill @rohangava9 pic.twitter.com/UDbnWmTYGJ
— Cricket Fanatic (@CricketFanatik) September 29, 2022
ఈ ఇన్నింగ్స్ లే.. కాదు ప్రస్తుతానికి ఇంగ్లాండ్ కౌంటీలు ఆడుతున్న గిల్ అక్కడా నిలకడగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో రోహన్ గవాస్కర్ గిల్ పై పొగడ్తల వర్షం కురిపించాడు.”భారత మాజీ క్రికెటర్ అమోల్ మంజుదర్, గిల్ గురించి నాకు మొదటిసారి చెప్పాడు. ‘రోహాన్.. నేను ఓ ఫ్యూచర్ సూపర్‌స్టార్‌ని చూశాను. అతను కచ్చితంగా టీమిండియాకి ఆడతాడు. అందులో నాకు ఎలాంటి డౌట్ లేదు..’ అని చెప్పాడు. మంజుదర్ మాటల్లో ఆ ఉత్సాహం, సంతోషం చూసి నేనూ గిల్ ఆటను చూడాలనుకున్నా. అలా గిల్ ఆటని గమనించాక మంజుదర్ మాటల్లో నిజం ఉందని అనిపించింది. భవిష్యతుల్లో మూడు ఫార్మాట్లలోనూ అతడు భారత జట్టుకు కీలక ప్లేయర్‌గా మారతాడు. అతని ఆటలో కావాల్సినంత టెక్నిక్ ఉంది, స్టయిల్ ఉంది. ఇప్పుడు అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన సమయం. ఒకటి రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయినంత మాత్రం తీసి పక్కనబెట్టే ఆటగాడు కాదతను. సరైన అవకాశాలు వస్తే, క్రికెట్ ప్రపంచాన్ని ఏలతాడు..” అంటూ గవాస్కర్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.
(“Rohan, I’ve seen an absolute superstar”: Rohan Gavaskar recalls Amol Mazumdar spotting Shubman Gill at the NCA, Bengaluru) has been published on Online Cricket News – https://t.co/UZWkKOggeb
— www.Cric.News (@CricNewsToday) September 29, 2022