ఇంగ్లాండ్ – భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ మన్కడ్ చేసింది. ఈ విషయం తీవ్ర వివాదాస్పదమైంది. కొందరు దీప్తి శర్మను విమర్శిస్తే, మరికొందరు అంతా నిబంధనలకు లోబడే జరిగిందని ఆమెకు మద్దతు పలికారు. అయినప్పటికీ.. ఇంగ్లాండ్ క్రికెటర్లు దీన్ని ‘క్రీడా స్ఫూర్తి’కి విరుద్ధమంటూ, ఇలా గెలిచినందుకు భారత జట్టు సిగ్గపడాలంటూ ట్వీట్లు చేశారు. ఇంతటితో ఈ వివాదం ముగిసిందా అంటే.. లేదు. దీనిపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా.. ఈ విషయంపై.. బెన్ స్టోక్స్, హర్షా భోగ్లే మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది.
మన్కడింగ్‌ని రనౌట్‌గా పరిగణించాలని ఐసీసీ ఈ మధ్యనే రూల్ మార్చిన సంగతి తెలిసిందే. ఇవేమీ పట్టించుకోకుండా.. ఇంగ్లాండ్ ఆటగాళ్లు, భారత జట్టు మోసం చేసి మ్యాచ్ గెలిచిందంటూ నెట్టింట తెగ గొడవ చేశారు. ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. ఏకంగా ఈ వివాదంలోకి సచిన్ టెండూల్కర్‌ని లాగేందుకు ప్రయత్నించి నెటజన్లతో చివాట్లు తిన్నాడు. ఈ వివాదం ఎంతకీ చల్లారకపోవడంతో భారత స్టార్ కామెంటేటర్ హర్షా భోగ్లే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ‘ఇంగ్లాండ్ మీడియాలో చాలామంది క్రీడా రూల్స్‌ని బట్టి నడుచుకున్న ఓ అమ్మాయిని టార్గెట్ చేయడం దారుణం. ఇలా అమ్మాయిని తిట్టి అక్రమంగా ఆదాయాన్ని ఆర్జించుకోవాలని చూస్తున్నారు. ఇది వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇందులో కొందరు సో కాల్డ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారంటూ..’ కామెంట్లు విసిరాడు.
stop believing that the world must move at their bidding. As in society, where judges implement the law of the land, so too in cricket. But I remain disturbed by the vitriol directed towards Deepti. She played by the laws of the game and criticism of what she did must stop
— Harsha Bhogle (@bhogleharsha) September 30, 2022
“ఇదేనా మీకున్న సంస్కారం. క్రికెట్ ప్రపంచాన్ని చాలా ఏళ్లు ఏలారు, క్రికెట్‌లో ఇలా ఉండాలి? అలా ఉండాలి చెప్పారు. అలాంటిది.. ఇప్పటికీ మీ ఆలోచనా విధానంలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రపంచం ఏది తప్పు అనుకుంటుందో దాన్ని ఇంగ్లాండ్ కూడా తప్పుగాని పరిగణించాలి. అంతేకానీ.. అందరూ తప్పు కాదు అన్న దాన్ని.. తప్పే అనడం మూర్ఖత్వం. బౌలర్ బంతి వేయకముందు నాన్‌స్ట్రైయికర్ క్రీజు దాటకూడదనేది రూల్. ఆ రూల్ దాటితే రనౌట్ చేసే అవకాశం బౌలర్‌కి ఉంటుంది. దాన్ని ఎవ్వరైనా ఒప్పుకుని తీరాల్సిందే. ఇందులో క్రీడా స్ఫూర్తికి సంబంధం లేదు..” అంటూ హర్షా భోగ్లే వరుస ట్వీట్లు చేశాడు.
I find it very disturbing that a very large section of the media in England is asking questions of a girl who played by the laws of the game & none at all of another who was gaining an illegal advantage and was a habitual offender. That includes reasonable people & I think (1/n)
— Harsha Bhogle (@bhogleharsha) September 30, 2022
ఈ ట్వీట్లకు ఇంగ్లాండ్ టెస్టు టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. “హర్షా.. మన్కడ్‌పై జనాల అభిప్రాయానికి కల్చర్‌కి లింగ్ ఏంటి? 2019 వరల్డ్ కప్ జరిగి రెండేళ్లు గడిచిపోయాయి. ఇప్పటికి నన్ను తిడుతూ భారత అభిమానులు రోజూ మెసేజ్‌లు చేస్తున్నారు. దీనిపై నువ్వేమంటావ్” అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై హర్షా భోగ్లే మరోసారో స్పందించాడు. ‘అక్కడ జరిగిన ఓవర్‌త్రో ఇన్సిడెంటులో నీ తప్పు లేదు. ఆ విషయంలో నీకు మేం సపోర్ట్‌గా ఉంటాం. వచ్చిందల్లా.. నాన్ స్ట్రైయికర్ బ్యాకింగ్ గురించి. ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఈ విషయంపై చేసిన మాటల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. క్రికెట్ గురించి నీకు ఏం చెప్పి నేర్పించారో అదే కల్చర్. అందుకే అలా అన్నాను..’ అంటూ సమాధానం ఇచ్చాడు.
Harsha .. 2019 WC final was over 2 years ago, I still till this day revive countless messages calling me all sorts from Indian fans, does this disturb you? https://t.co/m3wDGM7eU3
— Ben Stokes (@benstokes38) October 1, 2022
లార్డ్స్ వేదికగా జరిగిన భారత్, ఇంగ్లాండ్ మహిళల మ్యాచ్‌లో ఇంగ్లాండ్ క్రీడాకారిణి షార్లెట్ డీన్‌ను భారత బౌలర్ దీప్తి శర్మ ‘మన్కడ్’ అవుట్ చేసింది. ఆమె బాల్ వేయకముందే నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న డీన్ క్రీజును దాటేసింది. దీంతో వెనక్కు తిరిగిన ఆమె వికెట్లను కూల్చింది. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన డీన్ మైదానంలో కంటతడిపెట్టింది.
How it can be fair… though the laws of cricket allow you to do that but what about the spirit of the game.
It doesn’t sound good. And today’s World cricket friendly. #SpiritOfCricket #Deepthisharma #RunOut pic.twitter.com/oNOeUQMXp9— Devendra Singh Tomar (@dst_lucky) September 24, 2022