టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీకి, నూతన సారధి రోహిత్ శర్మకు మధ్య సత్సంబంధాలు లేవనే పుకార్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఒకరంటే ఒకరికి పడదని, అందుకే మైదానంలో క్లోజ్‌గా ఉండరనే వాదన ఉంది. వీరిద్దరి ఫ్యాన్స్ కూడా ఈ విషయాలపై సోషల్ మీడియా వేదికగా నిత్యం గొడపపడుతూనే ఉంటారు. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు ఏకంగా వారి పర్సనల్ విషయాలను బయటకు లాగుటున్నారు. గతంలో జరిగిన విషయాలను పోస్టు చేస్తూ.. ‘విరాట్ కోహ్లీతో రోహిత్ భార్య డేటింగ్’ చేసిందంటూ వార్తలను ప్రచారం చేస్తున్నారు. అందుకు సాక్ష్యంగా వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. భారత జట్టుకు ఇద్దరూ పిల్లర్లు లాంటి వారు. ఏ ఒక్కరు లేకున్నా భారత జట్టును ఊహించుకోలేం. వీరిద్దరి మధ్య ఎన్ని గొడవలున్నా అవి బయటకు కనిపించకుండా.. దేశం కోసం కలిసి పోరాడుతున్నది వాస్తవం. ఇలా ఒకవైపు దేశం కోసం.. మరోవైపు కుటుంబం కోసం సమయం కేటాయిస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. కోహ్లీ- అనుష్క శర్మను, రోహిత్ శర్మ- రితికా సజ్దేను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులు ఇలా ఉంటే.. వీళ్ల అభిమానులు మాత్రం ఒకరిపై.. ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గడిచిపోయిన సంఘటనలను కావాలనే బయటకు లాగుటున్నారు. గతంలోవిరాట్ కోహ్లీకి.. రితికా మేనేజర్ గా పనిచేస్తున్న సమయంలో కలిసి తిరిగిన ఫోటోలను పోస్తూ చేస్తూ కించపరుస్తున్నారు.
Virat Kohli chose Anushka Sharma over Ritika Sajdeh but Rohit Sharma married her. He is now captain in all the formats.
Virat Kohli lost captaincy, form and might be losing place in the team in next 1-2 years. pic.twitter.com/yE2lZ12yxd— Sunil the Cricketer (@1sInto2s) February 19, 2022
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను పెళ్లాడక ముందు కొందరు హీరోయిన్లు, మోడళ్లతో డేటింగ్ చేసిన విరాట్ కోహ్లీ… రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేతో కూడా డేటింగ్ చేశాడన్నది అభిమానులు ప్రచారం చేస్తున్న వార్త. వాస్తవానికి పెళ్లి కాకముందే విరాట్ కోహ్లీతో రోహిత్ భార్యకు పరిచయం ఉంది. 2010 ఐపీఎల్ సమయంలో రితికాకి, కోహ్లీకి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మూడేళ్ల పాటు కోహ్లీకి మేనేజర్‌గా కూడా పనిచేసింది రితికా. ఆ సమయంలో ఇద్దరూ కలిసి బయట తిరిగేవారు. అలా 2013లో జింబాబ్వే టూర్ నుంచి స్వదేశానికి వచ్చిన కోహ్లీ, రితికాతో కలిసి సినిమాకు వెళ్లాడట.
ఎలానో ఈ విషయాన్ని పసిగట్టిన మీడియా అక్కడకి చేరుకొని వారి ఫోటోలు తీసింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా పుకార్లు పుట్టించారు. దీనిపై విరాట్ కోహ్లీ వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. రితికాకు, తనకు మధ్య ఏమీ లేదని, తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పాడు. ఆ తర్వాత కొంత కాలానికి కోహ్లీ దగ్గర పనియడం మానేసిన రితికా, రోహిత్ శర్మకు మేనేజర్‌గా పనిచేసింది. ఆ సమయంలోనే అతని ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఇంతటితో పాత కథ సమాప్తమయ్యింది. గడిచిపోయిన వార్తలను అభిమానులు ఇప్పుడు ఎందుకు ప్రచారం చేస్తున్నారన్నది అంతుపట్టడం లేదు. కాగా, 2015, డిసెంబర్ 13న రితికా, రోహిత్ శర్మ పెళ్లి చేసుకుని ఒక్కటి కాగా.. రెండేళ్ల తర్వాత 2017, డిసెంబర్ 11న బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను పెళ్లాడాడు.. కోహ్లీ.
• A thread on Ritika Sajdeh’s all ex BFs:-
1. Virat Kohli https://t.co/la06KZdD2J pic.twitter.com/XWbMSMVtq3— BumbleBee 軸 (@itsMK_02) September 11, 2022