మోడళ్లతో ప్రేమాయణం నడిపిన క్రికెటర్లకు అంతేలేదు. యువరాజ్ సింగ్ – హెజెల్ కీచ్, విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ, కేఎల్ రాహుల్- అథియా శెట్టి, హార్దిక్ పాండ్యా-నటాషా స్టాంకోవిక్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు. వీరితో పాటు ఈ మధ్యనే లేటు వయసులోనూ ఘాటు ప్రేమ మొదలుపెట్టిన ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ – విశ్వసుందరి సుస్మితా సేన్ జంట కూడా క్రికెట్ తో పరిచయమున్నవారే. కాకుంటే.. వీరిలో కొందరు ప్రేమాయణం వరకే ఆపేయకుండా ఏడడుగులు కూడా నడిచారు. ఇప్పుడు వీరి అడుగుజాడల్లోకి యువ క్రికెటర్ పృథ్వీ షా కూడా చేరినట్లు వార్తలోస్తున్నాయి. మహారాష్ట్రకు చెందిన ఒక మోడల్ తో ప్రేమాయణం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నవరాత్రి ఉత్సవాలు దక్షిణాది రాష్ట్రాలలో అంతగా ప్రాముఖ్యం సంతరించుకోనప్పటికీ వెస్టర్న్ స్టేట్స్ లో బాగా ఫేమస్. అందరూ గర్భా డ్యాన్స్ చేస్తూ మెప్పిస్తుంటారు. అలా డాన్స్ నేర్చుకోవాలన్న కోరిక పుట్టిన పృథ్వీ షా, మోడల్ ‘నిధి తపాడియా’ దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నాడు.. అందుకు సంబధించిన పోటోలను పృథ్వీ షా తన ఇన్ స్టా స్టోరీలో పెట్టాడంతో అసలు మ్యాటర్ వెలుగులోకి వచ్చింది. దీంతో పృథ్వీ షా.. ఆమె తో డేటింగ్ మొదలుపెట్టాడంటూ వార్తలు రావడం మొదలయ్యాయి. ఇంతకీ ఈ మిస్టరీ గర్ల్ ఎవరా? అని వెతకడం మొదలుపెట్టేశారు.
మహారాష్ట్రకు చెందిన నిధి తపాడియా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, మోడల్, యాక్టర్. సోషల్ మీడియాలో ఆమెకు 104k మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె అందానికి కుర్రకారు అంతా ఫిదా అయిపోతూ ఉంటారు. అంతేకాదు.. ఆమె కొన్ని ప్రకటన ప్రచారాలలో కూడా నటించింది.. ప్రముఖ టీవీ షో CIDలో కూడా కనిపించింది. ఆమె ఇప్పటివరకు మోడలింగ్ చేసిన కొన్ని ప్రముఖ బ్రాండ్లు ఎల్లే ఇండియా, మాన్యవర్ మోహే. ఈ ప్రేమాయణం మధ్యలోనే ముగుస్తోందా! లేదా మూడు ముళ్ల దాకా తీసుకెళ్తుందా! అన్నది కాలమే నిర్ణయించాలి.