టీమిండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీలకు అవమానం జరిగిందంటూ ఈ స్టార్ క్రికెటర్ల ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. అందుకు ఐసీసీ(ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) చేసిన ఒక ప్రకటన కారణమైంది. ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్‌కు ముందు హిట్‌మ్యాన్, కింగ్ కోహ్లీకి దారుణమైన అవమానం జరిగినట్లు నెటిజన్లు సైతం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అసలు ఇంతకు ఏమైందంటే.. మరో రెండు వారాల్లో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2022లో ఈ ఐదుగురు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉందంటూ ఐసీసీ ఒక లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఆ ఐదుగురు ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గానీ, విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. ఇదే ఈ ఇద్దరి ఫ్యాన్స్‌కు కోపం తెప్పిస్తోంది.
ఐసీసీ ప్రకటించిన లిస్టులో కేవలం ఒకే భారత ప్లేయర్‌కు చోటు దక్కింది. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టాప్ 4లో ఉన్నాడు. తొలి స్థానంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, 2వ స్థానంలో శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా, 3వ స్థానంలో ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు జోస్ బట్లర్, 4వ ప్లేస్‌లో సూర్యకుమార్ యాదవ్, 5వ స్థానంలో పాకిస్థాన్ వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్‌కు చోటు దక్కింది. టీ20 వరల్డ్ కప్ 2022లో అద్భుత ప్రదర్శన కనబర్చే అవకాశం ఉన్న టాప్ ఫైవ్ ఆటగాళ్లు అంటూ ఐసీసీ పేర్కొనడం కొంత మంది స్టార్ క్రికెటర్ల అభిమానులకు కోపం తెప్పించింది. కాగా.. గత కొంత కాలంగా వారి ప్రదర్శనను బట్టి ఈ లిస్ట్ రూపొందించినట్లు సమాచారం.
వీరిలో డేవిడ్ వార్నర్, వనిందు హసరంగా గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లోనూ అద్భుతంగా రాణించారు. వార్నర్ టాప్ స్కోరర్ లిస్ట్‌లో రెండో ప్లేస్‌లో నిలవగా, హసరంగా 16 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇక బట్లర్, సూర్య, రిజ్వాన్‌లు ఆ వరల్డ్ కప్ తర్వాత చేసిన ప్రదర్శన ఆధారంగా ఈ వరల్డ్ కప్‌లోనూ రాణించే అవకాశం ఉందని ఐసీసీ భావించింది. గత కొంత కాలంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సరైన ఫామ్‌లో లేక ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. అందుకే వారికి ఈ లిస్ట్ చోటు దక్కలేదు. కాగా.. ఆసియా కప్, ఆస్ట్రేలియా సిరీస్‌లతో ఫామ్ అందుకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వరల్డ్ కప్‌లోనూ అద్భుతంగా రాణిస్తారని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ కప్ తర్వాత ఈ లెక్కలన్నీ తారుమారు అవుతాయని కూడా గట్టి నమ్మకంగా ఉన్నారు.
Just over two weeks to go until the start of #T20WorldCup 2022 🏆
Here are five players who could perform well on the big stage 👇https://t.co/wjhZXgVvMP
— ICC (@ICC) October 1, 2022
ఇది కూడా చదవండి: కోహ్లీ రికార్డును బాబర్ అజమ్ సమం చేశాడా? మ్యాచ్‌ల పరంగా ఓకే! కానీ..