భారత్‌కు 1983లో తొలి వన్డే వరల్డ్ కప్ అందించిన టీమిండియా కెప్టెన్ కపిల్ దేవ్, తిరిగి 28 ఏళ్ల తర్వాత 2011లో రెండో వన్డే వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ ఎంఎస్ ధోని ఒకే చోట కలిశారు. ఈ వరల్డ్ కప్ హీరోలు ప్రత్యేక మీట్లో తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ ఇద్దరు దిగ్గజాలు ఇలా ప్రత్యేకంగా ఎందుకు కలిశారంటే.. కపిల్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ధోని కపిల్‌దేవ్-గ్రాంట్ థార్న్టన్ ఇన్విటేషనల్ 2022 ఈవెంట్‌కు హాజరయ్యాడు. దీంతో ఇద్దరూ కలిసి సరదాగా గోల్ఫ్ ఆడుతూ.. సెల్ఫీ దిగారు. కాగా.. ఈ ఇద్దరు దిగ్గజాలను ఒకే ఫొటో ఫ్రేమ్‌లో చూసిన క్రికెట్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
కాగా.. ఇండియన్ క్రికెట్‌ను కొన్నేళ్ల పాటు ఏలిన ధోనికి ఫుట్‌బాల్‌లోనూ మంచి ప్రావీణ్యం ఉన్న విషయం తెలిసిందే. కానీ.. ధోని మంచి గోల్ఫ్ ప్లేయర్ అన్న సంగతి చాలా మందికి తెలియదు. హెలికాప్టర్ షాట్లతో క్రికెట్లో ఒక ట్రేండ్ సృష్టించిన ధోని.. గోల్ఫ్లోను కూడా చాలా సీరియస్‌గా ఆడుతూ కనిపించాడు. ఈ ఈవెంట్లో తన గోల్ఫ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు. ధోనీ గోల్ఫ్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. కాగా.. ధోని గోల్ఫ్ ఆడటం ఇదే తొలి సారి కాదు. 2019లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు, టీమిండియా ఆటగాడు కేదార్ జాదవ్‌తో కలిసి గోల్ఫ్ సెషన్లలో పాల్గొన్నాడు.
ఆ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. ఇకపోతే ధోనీ, కపిల్ దేవ్ యూఎస్ ఓపెన్ 2022లో ఇద్దరు కలిసి కన్పించారు. మళ్లీ ఇప్పుడు ఇలా ఇద్దరు ఒకే ఈవెంట్లో పాల్గొన్నారు. ఇకపోతే ఐపీఎల్ 2023లోనూ ధోని చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ 2022కు ముందు చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్‌గా తప్పుకున్న ధోని ఆ బాధ్యతలను జడేజాకు అందించాడు. కానీ.. జట్టు వరుస ఓటములతో దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సమయంలో జడేజానే కెప్టెన్సీ నుంచి తప్పుకుని తిరిగి ధోని చేతికే పగ్గాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
MS Dhoni and Kapil Dev together for golf. pic.twitter.com/ZXz6LHhHNF
— Deepak Chaudhary (@Deepaksdr4532) September 30, 2022
India’s World Cup-winning captains Kapil Dev and MS Dhoni play golf together. pic.twitter.com/w9Wvk4hB21
— cricpur (@cricpur) September 30, 2022
ఇది కూడా చదవండి: బుమ్రా విషయంలో షోయబ్ అక్తర్ మాట వందశాతం నిజమైంది!