జస్ప్రీత్ బుమ్రా గాయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీమిండియా ప్రధాన బౌలర్‌గా ఉన్న బుమ్రా గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్‌కు దూరం అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీమిండియా వీక్ బౌలింగ్ ఎటాక్‌తో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో డెత్ ఓవర్స్‌లో టీమిండియాకు ప్రధాన అస్త్రంగా ఉన్న బుమ్రా.. ఆస్ట్రేలియా వేదికగా జరిగే వరల్డ్ కప్‌కు అందుబాటులో లేకపోవడం జట్టు విజయావకాశాలను కచ్చితంగా ప్రభావితం చేసే అంశమే. అందుకే బుమ్రా గాయంపై ఇప్పుడు ఇంత తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. కాగా.. బుమ్రాకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని, కచ్చితంగా గాయాలపాలవుతాడని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఏడాది క్రితమే చెప్పడం గమనార్హం. అక్తర్ అప్పుడు బుమ్రా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు వందశాతం నిజం అయ్యాయి. ఇంతకి అక్తర్ ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ మొత్తం ఫ్రంటల్ యాక‌్షన్‌పై డిపెండ్ అయి ఉంటుందని, ఈ యాక్షన్‌తో బౌలింగ్ చేసే వారి వెన్నెముక, భుజంపై అధిక ఒత్తిడి ఉంటుందని అక్తర్ వెల్లడించాడు. తన బౌలింగ్ యాక‌్షన్ సైడ్-ఆన్‌గా ఉండేదని, రివర్టల్ యాక‌్షన్‌తో వెనుకపై ఒత్తిడిని ఇది భర్తీ చేసేదని తెలిపాడు. బుమ్రా లాంటి బౌలింగ్ యాక్షన్ ఉన్న బౌలర్లు తరుచూ వెన్నుముక, భుజం గాయాల పాలవుతుంటారని అన్నారు. ఈ బౌలింగ్ యాక‌్షన్‌తో వచ్చిన ప్రధాన ఇబ్బంది అదే అని బుమ్రా కూడా కచ్చితంగా తన బౌలింగ్ యాక‌్షన్ కారణంగానే గాయపడి, ఆటకు దూరం అవుతాడని వెల్లడించాడు. ప్రధానంగా షోల్డర్ స్పీడ్‌తోనే బుమ్రా బౌలింగ్‌ను వేస్తాడని, అతని బలమే అదని అక్తర్ పేర్కొన్నాడు.
ఇదివరకు వెస్టిండీస్ స్టార్ బౌలర్ ఇయాన్ బిషప్, న్యూజిలాండ్‌కు చెందిన షేన్ బాండ్.. ఫ్రంటల్ యాక‌్షన్‌తోనే బౌలింగ్ చేస్తుండేవాళ్లని చెప్పాడు. ఆ జాబితాలో టీమిండియా పేసర్ బుమ్రా చేరాడని అన్నాడు. మ్యాచ్ అయిపోయిందా.. రిహాబిలిటేషన్‌కు వెళ్లానా.. అని మాత్రమే బుమ్రా ఆలోచిస్తోన్నాడని, భవిష్యత్తులో అతను కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకుంటాడని అక్తర్ అప్పుడే చెప్పాడు. అలా జరగకుండా ఉండాలంటే అతనికి వీలైనంత ఎక్కువగా బ్రేక్ ఇవ్వాలని సూచించాడు. కానీ.. ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచ్‌లు తక్కువ టైమ్‌లో ఆడిన కారణంగానే బుమ్రాకు ఈ పరిస్థితి వచ్చినట్లు అక్తర్ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. కాగా.. అక్తర్ చెప్పిన మాటలు ఇప్పుడు అక్షర సత్యాలుగా మారడంతో ఆ పాత వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
Shoaib Akhtar’s year-old prediction about Jasprit Bumrah’s back goes viral#arynews https://t.co/cR8whxZySZ
— ARY NEWS (@ARYNEWSOFFICIAL) September 30, 2022
ఇది కూడా చదవండి: IPL అప్పుడు లేని గాయాలు.. ఇప్పుడే అవుతున్నాయా?: నెటిజన్స్