ఇండియన్ క్రికెట్‌లో ఇప్పుడు చర్చ అంత బుమ్రా టీ20 వరల్డ్ కప్‌కు దూరమవ్వడంపైనే నడుస్తుంది. బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. బుమ్రా గాయంతో వరల్డ్ కప్ దూరం అయ్యాడనే ప్రచారం జరుగుతోంది. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. ఆ వెంటనే సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆడతారని అంతా భావించినా గాయం కారణంగా తొలి మ్యాచ్ ఆడలేదు. మిగిలిన రెండు మ్యాచ్‌ల కోసం అతని స్థానంలో మొహమ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. దీంతో బుమ్రా సౌతాఫ్రికాతో సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ సిరీస్‌తో పాటు టీ20 వరల్డ్ కప్ నుంచి కూడా బుమ్రా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ క్రికెట్ అభిమానులు బుమ్రాపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఐపీఎల్‌లో రెండున్నర నెలల పాటు నిర్విరామంగా ఆడినప్పుడు భారత ఆటగాళ్లకు ఎలాంటి గాయాలు కావని.. టీమిండియాకు ఆడుతున్నప్పుడు మాత్రం తరచు గాయాల పేరుతో తప్పుకుంటూ ఉంటారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో బుమ్రాపై ఊహించని విధంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఐపీఎల్ అంటే ఎక్కడలేని ఉత్సహం చూపించే బుమ్రా.. ఇండియాకు ఆడమంటూ అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి అని సాకులు చెప్తాడని అంటున్నారు. అయినా ఐపీఎల్ ఆడితే భారీగా డబ్బు వస్తుందని.. టీమిండియా ఆడితే పేరు తప్ప పెద్దగా పైసలు రావు కదా అంటూ సెటైర్లు వేస్తున్నారు. గత నాలుగేళ్లలో బుమ్రా ఆడిన మ్యాచ్‌ల సంఖ్య కూడా అభిమానుల కోపానికి ఒక కారణంగా నిలుస్తుంది. 2019 నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ 60 మ్యాచ్‌లు ఆడితే ఆ జట్టు తరుఫున బుమ్రా 59 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. అదే టీమిండియా 70 మ్యాచ్‌లు ఆడితే బుమ్రా కేవలం 16 మ్యాచ్‌ల్లో భాగమయ్యాడు.
కాగా.. టీ20 వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మకమైన టోర్నీకి ముందు బుమ్రా గాయపడటంపై క్రికెట్ అభిమానులు కోపంగా ఉన్నారు. వారి కోపం వెనుక బుమ్రాపై ప్రేమ కూడా ఉంది. ఇకపోతే గాయం కారణంగా ఇటీవల యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ 2022కు దూరమైన బుమ్రా.. తిరిగి ఆస్ట్రేలియాతో సిరీస్‌తో జట్టులోకి వచ్చాడు. కానీ.. తొలి మ్యాచ్ ఆడలేదు. దీంతో బుమ్రా పూర్తి స్థాయిలో గాయం నుంచి కోలుకోలేదంటూ వార్తలు వచ్చాయి. కానీ.. రెండో మ్యాచ్‌తో బరిలోకి దిగి అద్భుతమైన యార్కర్‌తో ఆరోన్ ఫించ్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో బుమ్రా ఈజ్ బ్యాక్ అనుకున్నారంతా. కానీ.. రెండు మ్యాచ్‌ల తర్వాత మళ్లీ పాత గాయం మరింత తీవ్రంగా తిరగబెట్టడంతో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. అలాగే టీ20 వరల్డ్ కప్ కూడా దూరమయ్యేలా ఉన్నాడు.
Bumrah and Archer landing at Wankhede on 29th March for IPL opener. pic.twitter.com/RWof04fAAe
— viroot (@topgun_mav11) September 29, 2022
ఇది కూడా చదవండి: టీ20 వరల్డ్ కప్ ముందు ద్రవిడ్ ప్లాన్ రివర్స్! బుమ్రాతో పాటు..