ఒకప్పుడు టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన ఆటగాడు ప్రస్తుతం ట్రాఫిక్ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెుహాలీ స్టేడియం వద్ద విధులు నిర్వర్తిస్తూ.. మీడియాకు కనిపించాడు ఆ ఆటగాడు. మరి ఆ ఆటగాడు ఎవరో తెలుసుకుందాం.
ఐపీఎల్ 2023లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో 24 పరుగుల తేడాతో బెంగళూరు జట్టు విజయం సాధించిన సంగతి మనందరికి విదితమే. ఇక ఈ మ్యాచ్ విషయం కొద్దిసేపు పక్కన పెడితే.. మ్యాచ్ జరిగిన మెుహాలీ స్టేడియం వద్ద ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. అదేంటంటే? గతంలో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన ఓ ఆటగాడు ప్రస్తుతం పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తూ.. స్టేడియం వద్ద కనిపించాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
మెుహాలీ వేదికగా గురువారం పంజాబ్-బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ బ్యాటింగ్ లో రాణిస్తే.. సిరాజ్ బౌలింగ్ లో దుమ్మురేపాడు. ఇక ఈ మ్యాచ్ జరిగిన స్టేడియం దగ్గర ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. మెుహాలీ స్టేడియం వద్ద టీమిండియా పురుషుల హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాజ్ పాల్ సింగ్ పోలీస్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ కనిపించాడు. అతడు 2011లో టీమిండియా హాకీ జట్టుకు సారథిగా పనిచేశాడు.
ప్రస్తుతం మెుహాలీ లో ట్రాఫిక్ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు రాజ్ పాల్ సింగ్. స్టేడియం ప్రధాన గేట్ వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా విధులు చేపట్టాడు. కేవలం ఐపీఎల్ మ్యాచ్ లకే కాకుండా ఇతర అంతర్జాతీయ మ్యాచ్ లకు కూడా రాజ్ పాల్ సెక్యూరిటీకి సంబంధించిన విధులు నిర్వర్తించాడు. కాగా రాజ్ పాల్ సారథ్యంలోనే 2011 ఆసియా పురుషుల హాకీ ఛాంపియన్ షిప్ ను టీమిండియా సొంతం చేసుకుంది. అయితే స్పోర్ట్స్ కోటాలో ఆటగాళ్లకు పోలీస్ పదవులు ఇస్తారని మనకు తెలిసిన విషయమే.