Virat Kohli: చాలా రోజుల తర్వాత మళ్లీ ఆర్సీబీ కెప్టెన్ అవతారం ఎత్తిన కోహ్లీ బ్యాటింగ్‌లో దుమ్మురేపాడు. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగో హాఫ్ సెంచరీ బాదడమే కాకుండా.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
కింగ్ కోహ్లీ మరోసారి తన సత్తా చాటాడు. చాలా కాలం తర్వాత మరోసారి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కోహ్లీ.. బ్యాటింగ్‌లోనూ దుమ్మురేపాడు. ఈ సీజన్‌లో నాలుగో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోహ్లీ.. బ్యాటింగ్‌లో ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి ఆర్సీబీకి అదరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 137 పరుగులు జోడించారు. కోహ్లీ 47 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 59 పరుగులు చేసి రాణించాడు.
ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో మరే క్రికెటర్‌కు లేని రికార్డును కోహ్లీ నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో 100 సార్లు 30 ప్లస్ స్కోర్ చేసిన ఏకైక క్రికెటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఆర్సీబీకి ఆడుతున్న కోహ్లీ.. 5 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు సాధించాడు. అయితే టీ20 ఫార్మాట్‌లో 30 ప్లస్ స్కోర్ కూడా మంచి స్కోర్‌గానే పరిగణిస్తారు. దీంతో.. 30 ప్లస్ స్కోర్లలో కోహ్లీ సెంచరీ చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ సెంచరీల సెంచరీని నమోదు చేసినట్లు.. ఐపీఎల్‌లో కోహ్లీ 30 ప్లస్‌ల సెంచరీ నమోదు చేశాడు. మొత్తం మీద ఐపీఎల్‌లో కోహ్లీకి 6888 పరుగులు ఉన్నాయి. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లోనూ కోహ్లీ 74 సెంచరీలు ఉన్నాయి. ఇక పంజాబ్‌తో మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేశారు. కోహ్లీ 59, డుప్లెసిస్ 84 రన్స్‌తో రాణించారు. వీరిద్దరూ అవుటైన తర్వాత రన్‌రేట్ దారుణంగా పడిపోయింది. మ్యాక్స్‌వెల్ 0, దినేష్ కార్తీక్ 7 దారుణంగా నిరాశపరిచారు. చివర్లో లామ్‌రోర్ 7, షాబాజ్ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. మరి ఈ మ్యాచ్‌తో కోహ్లీ సాధించిన అరుదైన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.