SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Narendra Modi Stadium And Ipl Final Receives Guinness World Record

గిన్నిస్‌ బుక్‌లో ఎక్కిన నరేంద్ర మోదీ స్టేడియం

    Published Date - Mon - 28 November 22
  • |
      Follow Us
    • Suman TV Google News
గిన్నిస్‌ బుక్‌లో ఎక్కిన నరేంద్ర మోదీ స్టేడియం

క్రికెటర్లపై కాసుల వర్షం కురిపిస్తూ.. వ్యాపారులకు కోట్లు తెచ్చిపెడుతూ.. క్రికెట్‌ అభిమానులకు రెండున్నర నెలల పాటు వినోదాన్ని అందించే ఐపీఎల్‌కు అరుదైన ఘనత దక్కింది. ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో ఐపీఎల్‌కు స్థానం దక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్‌ 2022 ఫైనల్‌ జరిగిన విషయం తెలిసిందే. గతేడాది మే 29న గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌ను ఏకంగా 1,01,566 మంది ప్రత్యక్షంగా స్టేడియంలో వీక్షించారు. ఒక క్రీడను ఇంతమంది స్టేడియంలో వీక్షించడం వరల్డ్‌ రికార్డ్‌ అని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ గుర్తించింది.

ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జైషాకు రికార్డు పత్రం అందించింది గిన్నిస్‌ సంస్థ. ఈ విషయాన్ని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఇండియా గిన్సిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించడం ప్రతి ఒక్కరికి గర్వకారణం. ఇది ఆటను ప్రేమించే, సపోర్ట్‌ చేసే అభిమానుల కోసం. మోతేరా క్రికెట్‌ స్టేడియానికి, ఐపీఎల్‌కు శుభాకాంక్షలు’ అని పేర్కొంది. ఈ ట్వీట్‌ను రిట్వీట్‌ చేస్తూ.. జైషా కూడా ఒక ట్విట్‌ చేశాడు. ‘101566 మంది ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించి.. గిన్నిస్‌ రికార్డ్‌ అందించడంపై చాలా సంతోషంగా ఉంది. 29 మే 2022న అద్భుతమైన నరేంద్రమోదీ స్టేడియం. దీన్ని సాధ్యం చేసినందుకు అభిమానులకు మా అభినందనలు’ అంటూ పేర్కొన్నారు.

కాగా గతంలో మోతెరా స్టేడియంగా పిలువబడే ఈ స్టేడియానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టిన విషయం తెలిసిందే. గతంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంగా నరేంద్ర మోదీ స్టేడియం పలు రికార్డులను సృష్టించింది. భారీ సిట్టింగ్‌ సామర్థ్యం గల ఈ స్టేడియం.. గతేడాది జరిగిన ఐపీఎల్‌ 2022 ఫైనల్‌కు వేదికైంది. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌ ఘన విజయం సాధించి.. ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి ఏడాదే టైటిల్‌ గెలిచిన జట్టుగా నిలిచింది. టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌ పెద్ద పెద్ద టీమ్స్‌కు షాకిస్తూ.. వరుస విజయాలతో దూసుకెళ్లింది. ఇక ఫైనల్లోనూ అదే ఆటతీరుతో ఛాంపియన్‌గా నిలిచింది. ఈ అద్భుత విజయానికి తోడు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు కూడా ఇప్పుడు ఐపీఎల్‌ సొంతమైంది.

Extremely delighted & proud to receive the Guinness World Record for the largest attendance at a T20 match when 101,566 people witnessed the epic @IPL final at @GCAMotera‘s magnificent Narendra Modi Stadium on 29 May 2022. A big thanks to our fans for making this possible! @BCCI https://t.co/JHilbDLSB2

— Jay Shah (@JayShah) November 27, 2022

Narendra Modi Stadium receives ‘Guiness World Record’ for the biggest T20 audience during the IPL 2022 Final.

— Mufaddal Vohra (@mufaddal_vohra) November 27, 2022

Tags :

  • Cricket News
  • Guinness Book
  • ipl 2022
  • Jay Shah
  • Narendra Modi Stadium
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

15 పరుగులకే 3 వికెట్లు.. కష్టాల్లో టీమిండియా..!

15 పరుగులకే 3 వికెట్లు.. కష్టాల్లో టీమిండియా..!

  • వీడియో: వాషింగ్ట‌న్ సుంద‌ర్ సూపర్ క్యాచ్.. అమాంతం గాల్లోకి ఎగిరి..

    వీడియో: వాషింగ్ట‌న్ సుంద‌ర్ సూపర్ క్యాచ్.. అమాంతం గాల్లోకి ఎగిరి..

  • నా బ్యాటింగ్‌ టెక్నిక్‌లో లోపం ఉన్నట్లు అప్పుడు తెలిసింది: పృథ్వీ షా

    నా బ్యాటింగ్‌ టెక్నిక్‌లో లోపం ఉన్నట్లు అప్పుడు తెలిసింది: పృథ్వీ షా

  • చరిత్ర సృష్టించిన అమ్మాయిలు.. టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌!

    చరిత్ర సృష్టించిన అమ్మాయిలు.. టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన భార...

  • సచిన్ రికార్డుపై కన్నేసిన గిల్! ఇది కొడితే సచిన్ కూడా సలాం అంటాడు!

    సచిన్ రికార్డుపై కన్నేసిన గిల్! ఇది కొడితే సచిన్ కూడా సలాం అంటాడు!

Web Stories

మరిన్ని...

అంగరంగ వైభవంగా అక్షర్ పటేల్, మేహా పటేల్ పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్..
vs-icon

అంగరంగ వైభవంగా అక్షర్ పటేల్, మేహా పటేల్ పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్..

వైభవంగా రాకింగ్ రాకేష్- సుజాత నిశ్చితార్ధం..
vs-icon

వైభవంగా రాకింగ్ రాకేష్- సుజాత నిశ్చితార్ధం..

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!
vs-icon

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
vs-icon

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

తాజా వార్తలు

  • రథసప్తమి పూజ ఇలా చేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి..

  • ప్రధాని మోదీ కాన్వాయ్ లో రేంజ్ రోవర్ సెంటినెల్ కారు.. ప్రత్యేకతలివే!

  • బ్రేకింగ్: సికింద్రాబాద్‌లో మరో అగ్నిప్రమాదం..!

  • బ్లూ కలర్‌ లో తారకరత్న శరీరం.. కీలక విషయాలు వెల్లడించిన డాక్టర్!

  • సంచలనంగా మారిన రమ్య రఘుపతి ఆడియో కాల్ లీక్..

  • అన్‌స్టాపబుల్ షోలో పవన్ పెళ్లిళ్ల ప్రస్తావన! డైరెక్ట్ గా అడిగేసిన బాలయ్య!

  • బెస్ట్ ఐడియా.. మీ పాత ఫోన్‌నే మీ ఇంటి CCTV కెమెరాగా మార్చుకోండి!

Most viewed

  • ముందు అంతా సూపర్ హిట్ అనుకున్నారు! కానీ.. బాలయ్య సినిమా డిజాస్టర్!

  • Jr. NTRకు ఆస్కార్ వస్తే.. ఇండియన్ సినిమాలో జరగబోయే మార్పులు ఇవే!

  • ఓటిటిలో మిస్ అవ్వకుండా చూడాల్సిన కొత్త సినిమాలు!

  • పోలీసులకు దొరికిపోయిన నటుడు కమల్‌ కామరాజు.. వైరలవుతోన్న ట్వీట్‌!

  • కార్లోనే ఆ పని చేయాల్సి వచ్చింది! షాకింగ్ విషయాలు వెల్లడించిన రకుల్ ప్రీత్ సింగ్!

  • సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి! ఎందుకంటే?

  • బంగారు భవిష్యత్.. పాపం, చేతులారా నాశనం చేసుకుంది!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam