ఉమ్రాన్ మాలిక్.. ఇటీవల స్వదేశంలో జరిగిన ఐపీఎల్ టోర్నీలో బాగా వినిపించిన పేరు ఇది. ఏ మాజీ ప్లేయర్ నోటి వెంట విన్నా ఉమ్రాన్ గురించే చర్చ. గంటకు 150 కీ.మీ వేగంతో బంతులు వేస్తూ.. ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన తీరే.. అందుకు నిదర్శనం. ఈ ఏడాది సన్ రైజర్స్ తరుపున అద్భుత ప్రదర్శన చేసిన ఉమ్రాన్.. అంతర్జాతీయ జట్టులోకి అరంగ్రేటం చేశాడు. ఇక్కడివరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇది మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయేలా ఉంది. తన పేస్ తో ప్రత్యర్థులను భయపెడుతున్న ఉమ్రాన్ మాలిక్.. ధారలంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు.
ఐపీఎల్ టోర్నీలో 14 మ్యాచుల్లో 22 వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్.. ఆడిన ప్రతి మ్యాచులోనూ.. ఫాస్టెస్ట్ బాల్ అవార్డు గెలవడమే కాకుండా.. ఎమర్జెన్సీ ప్లేయర్ అవార్డును సైతం అందుకున్నాడు. దీంతో భారత జట్టులోకి అతని రాక సులభతరం అవుతుందని అందరూ అనుకున్నారు. నిజానికి.. అలాగే జరిగింది కూడా. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లాండు జట్లతో జరగబోయే టీ20 పర్యటనలకు ఉమ్రాన్ మాలిక్ ను ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికా సిరిస్ లో అవకాశం రానప్పటికీ.. ఐర్లాండ్ సిరీస్ లో అవకాశాలు ఇచ్చారు. కానీ ఉమ్రాన్.. వాటిని సద్వినియోగ పరుచుకోవడంలో దారుణంగా విఫలమయ్యాడు.
#TeamIndia 🇮🇳v🏴 #indvseng pic.twitter.com/MRP3fdQEWh
— Umran Malik (@UmranMalik1) July 11, 2022
ఇది కూడా చదవండి: Umran Malik: టీ20 వరల్డ్ కోసం ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకుంటాం: రోహిత్ శర్మ
ఐర్లాండ్ తో జరిగిన రెండు మ్యాచుల్లో ఆడిన ఉమ్రాన్.. భారీగా పరుగులివ్వడమే కాకుండా ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఇక ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టీ20లో 4 ఓవర్లు వేసి 56 పరుగులు సమర్పించి కేవలం ఒక్కటంటే ఒక్కటే వికెట్ తీశాడు. దీంతో మాజీలు సైతం రూటు మార్చారు. ఉమ్రాన్ దగ్గర వేగం ఉన్నాగానీ బంతులు విసరడంలో వైవిద్యం లేదని చెప్తున్నారు. గంటకు 15 కీ.మీ. వేగంతో బంతులు వేయగల ఉమ్రాన్ మాలిక్.. తన బౌలింగ్ లో కొన్ని మార్పులు చేసుకుని ముందుకు సాగితే జట్టులో కీలక బౌలర్ గా మారొచ్చు అంటూ సలహాలు ఇస్తున్నారు.
Superb 56 off just 24 balls from UMRAN MALIK 🥵 pic.twitter.com/GYpTmg6pXg
— Asad Abdullah (@asad_qureshi257) July 10, 2022
ఇక ఉమ్రాన్ భారీగా పరుగులు ఇస్తుండటంతో అతన్ని, అశోక్ దిండాతో పోలుస్తు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్ విషయంలో సెలెక్టర్లు కాస్త తొందర పపడ్డారేమో అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంకొంత కాలం డొమెస్టిక్ లెవల్లో పరీక్షించాల్సింది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
We are happy to announce that Umran Malik has joined our prestigious Dinda academy of excellence.
Hope he will flourish more under my and king unadkat guidance.
Many more such performances to come in upcoming years. He is here to stay in academy. ❤️ pic.twitter.com/53M4XHDpZO
— Sir Dinda¹⁶¹ (@ReallyDinda) July 10, 2022
ఇది కూడా చదవండి: IND vs ENG: కోహ్లీని వెనకేసుకొచ్చిన కెప్టన్ రోహిత్ శర్మ.. ట్రోలర్స్ నోర్లు మూయించాడుగా!