ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ సూపర్ బౌలింగ్‌తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో కేవలం 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ హాఫ్ సెంచరీతో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. ఇక ఈ చిన్న టార్గెట్‌ను ఆర్సీబీ ఈజీగా ఛేదిస్తుందనుకుంటే.. రాజస్థాన్ బౌలర్లు అద్భుతం చేశారు. విరాట్ కోహ్లీతో వికెట్ల వేట మొదలెట్టి.. హర్షల్ పటేల్ వికెట్‌తో గెలుపును పరిపూర్ణం చేసుకుంది. ఆర్సీబీలో ఏ ఒక్క బ్యాటర్ కూడా రాణించకపోవడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.
సగం జట్టు పెవిలియన్‌చేరినా కూడా ఆశలు పెట్టుకోగల ప్లేయర్ దినేష్ కార్తీక్ మాత్రం ఈ మ్యాచ్‌లో చాలా విచిత్రంగా రనౌట్ అయ్యాడు. యుజ్వేంద్ర చాహల్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ నాలుగో బంతిని షాబాజ్ అహ్మాద్ ముందుకు ఫుష్ చేశాడు. లేని పరుగు కోసం దినేష్ కార్తీక్ సగం పిచ్ దాటేశాడు. ఆ బంతి కాస్త బౌలర్‌కు కొంచెం ఎడంగా లెగ్‌సైడ్ ఫీల్డింగ్ చేస్తున్న ప్రసిద్ధ్ కృష్ణ చేతుల్లోకి వెళ్లింది. గమనించిన దినేష్ కార్తీక్ వెనక్కి వచ్చాడు. అప్పటికే ప్రసిద్ధ్ కృష్ణ చాహల్‌కు బంతి అందించాడు. కానీ.. దాన్ని చాహల్ సరిగా పట్టుకోలేకపోయాడు. చేతులోంచి జారిపోయిన బంతిని మళ్లీ ఎలాగోలా పట్టుకుని స్టంప్స్‌ను పడేశాడు. అప్పటికే కార్తీక్ క్రీజ్‌లోకి వచ్చాసి ఉంటాడని రాజస్థాన్ ఆటగాళ్లు రనౌట్‌పై అంత నమ్మకంగా లేరు. రిప్లేలో మాత్రం కార్తీక్ రనౌట్ అయ్యాడు.
రాదనుకున్న వికెట్ దక్కడంతో రాజస్థాన్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే దినేష్ కార్తీక్ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను క్రీజ్‌లో ఉంటే రాజస్థాన్‌కు కష్టాలు తప్పవు. అలాంటి ప్లేయర్ వికెట్ ఇంత సింపుల్‌గా దొరకడంతో రాజస్థాన్ ఆటగాళ్లు ఫుల్ ఖుషీ అయ్యారు. నిజానికి కార్తీక్ ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని క్రికెట్ పండితులు సైతం అభిప్రాయపడుతున్నారు. కానీ.. దురదృష్టవశాత్తు కార్తీక్ రనౌట్ అయి పెవిలియన్ చేరాడు. సింపుల్ రనౌట్ మిస్ చేసినట్లు కనిపించిన చాహల్ మాత్రం ఊపిరిపీల్చుకున్నాడు. కార్తీక్ రనౌట్‌ను అతను మిస్ చేసి ఉంటే.. కచ్చితం మ్యాచ్ ఓటమికి అతని తప్పిదమే కారణం అయ్యేది. మరి ఈ రనౌట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ IPLకి దూరం కానున్నాడా?
— James Tyler (@JamesTyler_99) April 26, 2022
— James Tyler (@JamesTyler_99) April 26, 2022
Daryl Mitchell lifted Yuzvendra Chahal after Dinesh Karthik’s run out. pic.twitter.com/fJoXndXEws
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 26, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.