భారత సెలెక్టర్లపై టీమిండియా స్టార్ క్రికెటర్ దినేష్ కార్తీక్ మండిపడ్డాడు. ఒక ప్లేయర్ కోసం ఏకంగా సెలెక్టర్లతో డీకే ఫైట్‌కు దిగాడు.
భారత క్రికెట్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఒకప్పుడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ప్రదర్శనే కీలకంగా మారేది. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీలో ప్లేయర్లు ఆడిన తీరును బట్టి వారిని టీమిండియా సెలెక్టర్లు ఎంపిక చేసేవారు. ఈ రెండు టోర్నమెంట్లలో బాగా ఆడిన వారికి దాదాపుగా భారత జట్టులో చోటు ఖాయం అనేలా పరిస్థితి ఉండేది. అయితే ఒక్కసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంట్రీతో అంతా మారిపోయింది. ఐపీఎల్లో బాగా ఆడిన ఆటగాళ్లు నేరుగా భారత జట్టులో చోటు దక్కించుకుంటున్నారు. అయితే వన్డేలు, టీ20లకు ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ ముఖ్యం అవుతున్నప్పటికీ.. టెస్టు టీమ్ సెలెక్షన్ విషయంలో మాత్రం ఇప్పటికీ దేశవాళీలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రాణించి, ఐపీఎల్‌లోనూ అదరగొడితే భారత జట్టులో ప్లేస్ పక్కా అనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. భారత జట్టుతో పాటు రంజీ, దులీప్ ట్రోఫీ జట్ల సెలెక్షన్‌పై విమర్శలు రావడం సహజమే.
టాలెంట్ ఉండి, తమను తాము ప్రూవ్ చేసుకున్న ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వకపోతే సెలెక్టర్లపై విమర్శలు వస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఒక విషయంలో టీమిండియా స్టార్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ భారత సెలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దులీప్ ట్రోఫీలో పాల్గొనే సౌత్ జోన్ టీమ్‌లోకి తమిళనాడుకు చెందిన బాబా ఇంద్రజీత్ను తీసుకోకపోవడంపై డీకే సీరియస్ అయ్యాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో నిలకడకు మారుపేరైన ఇంద్రజీత్.. ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా తరఫున ఆడాడు. అయినా అతడ్ని దులీప్ ట్రోఫీకి ఎందుకు సెలెక్ట్ చేయలేదో తనకు అర్థం కావడం లేదన్నాడు డీకే. బాబా ఇంద్రజీత్ కోసం ట్వీట్ చేసిన దినేష్ కార్తీక్‌కు ఫ్యాన్స్ మద్దతు తెలుపుతున్నారు. ప్రతిభ కలిగిన ఇంద్రజీత్ను ఎంపిక చేయకపోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఛీ ఛీ.. ఈ సెలెక్టర్లు ఎప్పటికీ అర్థం కారు అనేలా కార్తీక్ ట్వీట్ ఉందని నెటిజన్స్ చెబుతున్నారు.
I DONT understand selection committee these days
BABA INDRAJITH plays for Rest of India against MP in the first week of March 2023.
There has been no first class matches post that , but he doesn’t feature for SOUTH ZONE in the duleep trophy.
Can someone tell me why??#bcci
— DK (@DineshKarthik) June 14, 2023