ఐపీఎల్ 2023లో ఆర్సీబీ జట్టు గురించి మాట్లాడుకోవాలంటే..కోహ్లీ, డుప్లెసిస్,మ్యాక్స్ వెల్ తో మొదలు పెడితే.. బౌలర్లు సిరాజ్, హసరంగాతో ముగుస్తుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే జట్టులో 11 మంది ప్లేయర్లు ఉన్నప్పటికీ..5, 6 గురు ప్లేయర్లే మీదే ఆర్సీబీ అతిగా ఆధారపడుతుంది. మిగతావారు ఎందుకు ఉన్నారో అర్ధం కాదు. వారిలో ప్రధానంగా దినేష్ కార్తిక్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్ ప్రదర్శన గురించి మాట్లాడుకోవాలి. వీరు జట్టులో ఏదో నామ మాత్రంగా కొనసాగుతున్నారు
ప్రస్తుత ఐపీఎల్ లో బెంగళూరు జట్టు పరిస్థితి చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదు. గెలుస్తున్నారు అనుకునేలోపు అనూహ్యంగా కుప్పకూలిపోతున్నారు. ప్రారంభంలో విజ్రంభనతో ఇక 200 స్కోర్ ఖాయమనుకుంటున్న దశలో చివర్లో చేతులెత్తేస్తున్నారు. టాప్ ఆర్డర్ ఫామ్ లో ఉన్నారని ఆనందించేలోపు మిడిల్ ఆర్డర్ వైఫల్యం జట్టుని వేధిస్తుంది. ఇవన్నీ చూసిన ఆర్సీబీ అభిమానులు మా పరిస్థితి ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారు. పడుతూ లేస్తూ ఒక మాదిరి ప్రదర్శన చేస్తున్నప్పటికీ.. పూర్తి స్థాయిలో అభిమానులకి కిక్ ఇవ్వలేకపోతుంది. ఆరేంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రెండు కూడా బెంగళూరు జట్టు దగ్గరే ఉన్నా.. ఇంకా ఎందుకు వెనుకబడుతుంది.
ఐపీఎల్ 2023లో ఆర్సీబీ జట్టు గురించి మాట్లాడుకోవాలంటే..కోహ్లీ, డుప్లెసిస్,మ్యాక్స్ వెల్ తో మొదలు పెడితే.. బౌలర్లు సిరాజ్, హసరంగాతో ముగుస్తుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే జట్టులో 11 మంది ప్లేయర్లు ఉన్నప్పటికీ..5, 6 గురు ప్లేయర్లే మీదే ఆర్సీబీ అతిగా ఆధారపడుతుంది. మిగతావారు ఎందుకు ఉన్నారో అర్ధం కాదు. వారిలో ప్రధానంగా దినేష్ కార్తిక్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్ ప్రదర్శన గురించి మాట్లాడుకోవాలి. వీరు జట్టులో ఏదో నామ మాత్రంగా కొనసాగుతున్నారు తప్పితే ఇప్పటివరకు పొడిచిందేమి లేదు. టాప్ ఆర్డర్ మంచి స్టార్ట్ ఇస్తుంటే వీరు మాత్రం ఇన్నింగ్స్ ని చెత్తగా ముగిస్తున్నారు. ఛేజింగ్ లో కొన్ని సింపుల్ మ్యాచులు కూడా వీరి చెత్త ప్రదర్శనతో ఓడిపోయారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా ఆడుతూ జట్టుని కష్టాల్లో పడేస్తున్నారు.
ఆర్సీబీ బలహీనత అంతా వారి మిడిల్ ఆర్డర్. మొన్నటివరకు ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ అంటే అందరికీ వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ గుర్తుకొస్తాడు. గతేడాది కార్తీక్ ఫినిషర్ గా బెంగళూరు జట్టుకి సంచలన విజయాలు అందించాడు. ఒకానొక దశలో అందరూ విఫలమైనా నేనున్నాను అంటూ అసాధ్యం అనుకున్న కొన్ని మ్యాచులు కూడా గెలిపించాడు. ఈ ప్రదర్శన కారణంగా ఏకంగా టీమిండియాలోకే ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఈ వెటరన్ బ్యాటర్ నుంచి ఆ రేంజ్ ప్రదర్శన కాకపోయినా కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపొతున్నాడు.
మిడిల్ లో కార్తీక్ ఉన్నాడనే ధైర్యంతోనే కోహ్లీ ఓపెనర్ గా మ్యాక్స్ వెల్ నెంబర్ 3 లో వస్తున్నారు. కానీ ప్రస్తుతం కార్తీక్ ఏదో కష్టంగా జట్టులో కొనసాగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఒక్క ఇన్నింగ్స్ లో కూడా 30 పరుగుల స్కోర్ చేయలేదు. ఏదో ఆడుతున్నాను అంటే ఆడుతున్నాను నాకేం సంబంధం లేదు అనేట్లుగా ఉంది ఈ వెటరన్ బ్యాటర్ పరిస్థితి. ఇంకా ఈ ఆటగాడిని నెత్తిన పెట్టుకుంటే ఆర్సీబీ భారీగా నష్టపోవడం ఖాయం. కొంచెం కూడా అంకిత భావం లేకుండా కీపర్ గా కూడా రాణించలేకపోతున్నాడు. ఇక ఎటు టీమ్ ఇండియాలో స్థానం రాదని గ్రహించి కావాలనే ఇలా ఆడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇకనైనా ఆర్సీబీ.. ఈ ఫినిషర్ మీద అతిగా ఆధారపడకుండా ఉంటే మంచిది.
ఇక షాబాజ్ అహ్మద్ జట్టులో కొనసాగుతున్నాడు కానీ ఎందుకూ ఉపయోగపడడం లేదు. ఒకప్పుడు ఆశ్చర్యకరంగా బౌండరీల వర్షం కురిపిస్తూ.. అనూహ్యంగా వికెట్లు తీస్తూ ఉండే ఈ అల్ రౌండర్ ఇప్పుడు తేలిపోతున్నాడు. కేవలం అల్ రౌండర్ అనే జట్టులో ఉన్నాడు గాని.. ఆర్సీబీ ఈ ఆటగాడి వలన కొంచెం ఉపయోగం లేదు. అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్ లో పూర్తిగా విఫలమవుతున్నాడు. నెంబర్ 3 లో ప్రమోషన్ వచ్చినప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఈ ఐపీఎల్లో పనికి మాలిన అల్ రౌండర్ల లిస్ట్ తీస్తే షాబాజ్ ప్రధమ వరుసలో ఉంటాడు. ఇకనైనా కాస్త ఆటమీద దృష్టి పెడితే మంచిది. లేకపోతే తుది జట్టులో స్థానం కూడా కోల్పోతాడు.
హర్షల్ పటేల్ అంటే పర్పుల్ క్యాప్ రేస్ లో ఎప్పుడూ ముందుంటాడు. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు. ఎప్పుడూ స్లో బాల్స్ ని నమ్ముకుంటే ఏం లాభం. కొంచెం మైండ్ కూడా వాడి వేరియేషన్స్ చూపిస్తే బాగుంటుంది. గత రెండేళ్లుగా స్లో బాల్స్ తో బ్యాటర్లను బోల్తా కొట్టిస్తుంటే ఇప్పుడు బ్యాటర్లు మాత్రం ఈ వీరుడి బౌలింగ్ ని చీల్చి చెండాడుతున్నారు. హర్షల్ ని ఆర్సీబీలో ప్రధాన బౌలర్ గా పరిగణిస్తుంటే ఇప్పుడు వచ్చిన కొత్త బౌలర్ వైశుక్ ఇతనికన్నా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ ముగ్గురు ఒకప్పుడు బెంగళూరు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు కాబట్టి కొనసాగుతున్నారు కానీ.. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో బెంచ్ మీద కూర్చునే వాళ్ళే. ఇక అభిమానులైతే వారిని ఎందుకు జట్టులో కొనసాగిస్తున్నారని మంది పడుతున్నారు. మరి రాబోయే మ్యాచుల్లోనైనా రాణించి బెంగళూరు ని ప్లే ఆఫ్ కి తీసుకు వెళ్ళడానికి తమ వంతు ప్రయత్నం చేస్తే కోహ్లీ పరువు కాపాడిన వారవుతారు. లేకపోతే ఇసాల కప్ నందే అనడానికి కూడా ఛాన్స్ ఉండదు.