దినేష్ తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు చేస్తున్నాడంటూ రచిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దినేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తాను ఎటువంటి అసభ్యకర మెసేజ్‌లు పంపలేదన్నారు.
‘స్వాతి చినుకులు’ సీరియల్ ఫేమ్ రచితా మహాలక్ష్మి తన భర్త దినేష్ కార్తీక్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దినేష్ తనకు అసభ్యకర మెసేజ్‌లు చేస్తూ వేధిస్తున్నాడని, ఫోన్ కాల్స్ ద్వారా టార్చర్ చేస్తున్నాడని ఆమె చెన్నైలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఈ నేపథ్యంలోనే తనపై వస్తున్న ఆరోపణలపై దినేష్ కార్తీక్ స్పందించారు. తాజాగా, ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. రచితతో తాను జరిపిన చాటింగ్‌లను మీడియాకు చూపించారు.
ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ.. ‘‘ నేను వేధిస్తున్నానని, వాట్సాప్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నానని కంప్లైంట్ చేసింది. నేను ఆమెకు అసభ్యకర మెసేజ్‌లు పంపలేదు. నా ఫోన్ చెక్‌చేసుకోండి( హోస్ట్ చేతికి ఫోన్ ఇచ్చి చెక్ చేసుకోమని చెప్పారు). నేను ఏ మెసేజ్‌ను డిలీట్ చేయలేదు. యూఎస్ టెక్నాలజీ వాడుకున్నా పర్లేదు. ఇప్పుడు కూడా ఆమె పేరు బంగారీ అని ఫీడ్ చేసి ఉంది. అది నేను కొద్దిరోజుల్లో మారుస్తాను. అందులో ఏమీ ఉండదు.
నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వమని మాత్రమే అడిగాను. అందులో ఉన్న వాయిస్ నోట్లు నాకు, వాళ్లమ్మకు మధ్య జరిగిన సంభాషణలు. నిన్న వీటన్నింటినీ పోలీస్ స్టేషన్‌లో చెక్ చేశారు’’ అని చెప్పుకొచ్చారు. కాగా, దినేష్ కార్తీక్, రచితా మహాలక్ష్మి తమిళంలో ఓ సీరియల్‌లో కలిసి నటించారు. ఈ సీరియల్ షూటింగ్ సందర్భంగా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి 2013లో పెళ్లి చేసుకున్నారు. అయితే, వీరి కాపురం ఎక్కువ రోజులు సజావుగా సాగలేదు.