ఐపీఎల్ 2022 సీజన్ ఎంతో ఉత్కంఠగా సాగుతోందని చెప్పేందుకు ఆదివారం జరిగిన రెండు మ్యాచ్ ల ఫలితాలను ఉదాహరణగా చెప్పొచ్చు. మొదట బ్యాటింగ్ చేసిన రెండు జట్లు భారీ స్కోర్ నమోదు చేయగా.. ఛేజింగ్ కు దిగిన రెండు జట్లు తక్కువ స్కోరుకే ఆలౌట్ గా నిలిచాయి. చెన్నై- ఢిల్లీ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైంది. కాన్వే(87), గైక్వాడ్(41), దూబే(32) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి చెన్నై 208 పరుగులు స్కోర్ చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు కేవలం 117 పరుగులకే ఆలౌట్ గా నిలిచి ఆట ముగించింది. వెరసి చెన్నై జట్టు 91 పరుగులు తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ఇప్పటివరకు మైనస్ ఉన్న నెట్ రన్ రేట్ కూడా ప్లస్ లోకి వచ్చేసింది.
ఇదీ చదవండి: బౌలింగ్ లోనే అనుకుంటే.. హైదరాబాద్ ఇప్పుడు ఫీల్డింగ్ లో కూడా చేతులెత్తేస్తోంది!
చెన్నై అభిమానులు ఆనందపడేందుకు ఈ భారీ విజయం ఒక్కటే కారణం కాదు.. సీఎస్కేకి ఇంకా ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. అందుకే చెన్నై అభిమానుల్లో ఆనందం రెట్టింపు అయ్యింది. అవును ఐపీఎల్ 2022 సీజన్లో ఇంకా చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. కానీ, అది అంత సులువుగా జరిగే పని కాదు. ఆ అవకాశం కేవలం చెన్నై ఆట మీద ఆధారపడి లేదు. ధోనీ సేన ప్లే ఆఫ్స్ చేరాలంటే కొన్ని అద్భుతాలు జరగాలి. అలాగని అది అసాధ్యం అని చెప్పలేం. ఎందుకంటే ఐపీఎల్ లో ఏమైనా జరగచ్చు. గెలుస్తుంది అనుకున్న జట్టు ఓటమి పాలవచ్చు.. చెత్త జట్టు అనుకున్నదే కప్పు కొట్టచ్చు.
If we make the playoffs, great. But even if we don’t it’s not the end of the world – #THA7A #CSKvDC #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/7Y5XJyekwS
— Chennai Super Kings (@ChennaiIPL) May 8, 2022
అయితే చెన్నై ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఏం అద్భుతాలు జరగాలో చూద్దాం. చెన్నై రానున్న ప్రతి మ్యాచ్ లో విజయం సాధించాలి. అత్యంత భారీ తేడాతో గెలిస్తే ఇంకా మంచిది. అంతేకాకుండా మిగిలిన జట్ల విజయాలపై కూడా చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశం ఆధారపడి ఉంది. అందుకు ఎలాంటి ఫలితాలు రావాలంటే..
ముంబై Vs కోల్‌కతా – ఎవరు గెలిచినా పర్లేదు
లక్నో Vs గుజరాత్ – ఎవరు గెలిచినా పర్లేదు
రాజస్థాన్ Vs ఢిల్లీ – రాజస్థాన్ గెలవాలి
చెన్నై Vs ముంబై – చెన్నై గెలవాలి
పంజాబ్ Vs బెంగళూరు – పంజాబ్ గెలవాలి
కోల్‌కతా Vs హైదరాబాద్ – కోల్ కతా గెలవాలి
చెన్నై Vs గుజరాత్ – చెన్నై గెలవాలి
లక్నో Vs కోల్‌కతా – ఎవరు గెలిచినా పర్లేదు
ఢిల్లీ Vs పంజాబ్ – ఢిల్లీ గెలవాలి
ముంబై Vs హైదరాబాద్- ముంబై గెలవాలి
లక్నో Vs కోల్‌కతా – ఎవరు గెలిచినా పర్లేదు
గుజరాత్ Vs బెంగళూరు – గుజరాత్ గెలవాలి
చెన్నై Vs రాజస్థాన్ – చెన్నై గెలవాలి
ముంబై Vs ఢిల్లీ – ముంబై గెలవాలి
హైదరాబాద్ Vs పంజాబ్ – హైదరాబాద్ గెలవాలి
తర్వాతి మ్యాచ్‌ల ఫలితాలన్నీ ఈ విధంగా వస్తే.. 14 పాయింట్లతో చెన్నై, హైదరాబాద్, పంజాబ్ జట్లు టై అవుతాయి. అప్పుడు ఎవరికైతే ఎక్కువ నెట్ రన్ రేట్ ఉంటుందో ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు వెళ్తుంది. అందుకే చెన్నై ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే రానున్న ప్రతి మ్యాచ్ భారీ విజయాలు నమోదు చేయడం కూడా తప్పనిసరి. చెన్నై ప్లే ఆఫ్స్ చేరుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Roaring together as a team with a ✅ in all departments!#CSKvDC #Yellove #WhistlePodu 🦁💛 pic.twitter.com/AKMFNIc1sl
— Chennai Super Kings (@ChennaiIPL) May 9, 2022