ఐపీఎల్-2022 సీజన్ ప్రారంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఇలాంటి తరుణంలో తాను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ధోనీ ప్రకటించాడు. అంతేకాకుండా నెక్ట్స్ కెప్టెన్సీ కోసం జడేజాను ఎంచుకుంటూ యాజమాన్యానికి సూచించాడు కూడా. అయితే ఈ తరుణంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ధోనీ కెప్టెన్సీ వదులుకోవడంపై చాలా మంది స్పందించారు. కానీ, వసీం జాఫర్ చేసిన ట్వీట్ మాత్రం అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది.
ఇదీ చదవండి: IPL 2022: CSK కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ
బాహుబలి-2 సినిమాలో ప్రభాస్ తన రాచరికాన్ని వదిలేసి.. సామాన్యుడిగా మారిపోతాడు. తన రాజ్యం కోసం, తన ప్రజల కోసం మాత్రం కష్టపడుతూనే ఉంటాడు. ఒక గొప్ప రాజుగా బతికిన వ్యక్తి అతి సామాన్యుడిగా మారిపోవడాన్ని ఆ వీడియోలో కనిపిస్తుంది. ఆ వీడియో షేర్ చేసిన వసీం జాఫర్.. కెప్టెన్సీ వదిలేసిన ధోనీ ఆటగాడిగా కొనసాగనున్నాడు అంటూ ట్వీట్ చేశాడు. అది ఒక్క వసీం జాఫర్ అభిప్రాయమే కాదు.. మొత్తం చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల భావన కూడా అదే అంటున్నారు. ఆ ట్వీట్ వైరల్ గా మారింది. వసీం జాఫర్ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
MS Dhoni leaving CSK captaincy and continuing as a player: #IPL2022 pic.twitter.com/auPPAtvxM3
— Wasim Jaffer (@WasimJaffer14) March 24, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.