మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కి క్రేజ్ తెచ్చిన ప్లేయర్ సచిన్ టెండూల్కర్. ఇందుకే సచిన్ ని క్రికెట్ దేవుడు అంటారు. మరి.. ఇలాంటి సచిన్ తో కలసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవాలన్నా కూడా అదృష్టం ఉండాలి. ముఖ్యంగా యంగ్ క్రికెటర్స్ కి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ పుణ్యమా అంటూ ఇప్పుడు ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ అంతా సచిన్ తో కలసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకుంటున్నారు. అయితే.., తాజాగా ముంబై డ్రెస్సింగ్ రూమ్ లో సచిన్ ప్రత్యక్షం అవ్వడం చూసి ఓ యంగ్ క్రికెటర్ భయపడి పోయాడు.
పోయిన ఏడాది ముంబై టీమ్ తరుపున అదరగొట్టిన ఇషాన్ కిషన్ ఏకంగా టీ20 వరల్డ్ కప్ జట్టులో కూడా స్థానం దక్కించుకున్నాడు. కానీ.., ఇప్పుడు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు కిషన్. కెప్టెన్ కోహ్లీ కూడా ఇప్పటికే కిషన్ తో మాట్లాడి, అతనిలో ధైర్యాన్ని నింపాడు. ఇక తాజాగా సచిన్ కూడా ముంబై జట్టుతో చేరారు. అయితే.. ఈ విషయం తెలియని ఇషాన్ క్యాజువల్ నడుస్తూ వచ్చి, ఒక్కసారిగా సచిన్ ని చూసి షాక్ అయిపోయాడు.
బస్సు దిగి బ్లాక్ సన్‌గ్లాసెస్… చెవుల్లో ఇయర్ బడ్స్ పెట్టుకొని చాలా క్యాజువల్‌గా ఇషాన్ కిషన్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చాడు. అక్కడ ఆల్రెడీ టీమ్ మెంటార్ సచిన్ టెండుల్కర్ కూర్చొని ఉన్నాడు. అతడిని చూడగానే కిషన్ ఒక్కసారిగా భయపడిపోయాడు. వెంటనే సన్‌క్లాసెస్, ఇయర్ బడ్స్ తీసేసి జేబులో పెట్టుకున్నాడు. అది సచిన్ పై తనకి ఉన్న రెస్పెక్ట్ అవ్వొచ్చు. కానీ.., స్కూల్ ప్రిన్స్ పాల్ ని చూసిన స్కూల్ పిల్లాడిలా కిషన్ ప్రవర్తించడంతో డ్రెస్సింగ్ రూమ్ లో నవ్వులు పూశాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫన్నీ వీడియోని పక్కన పెడితే.. టీ20 వరల్డ్ కప్ జట్టులో కిషన్ ని కొనసాగించాలని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియు చేయండి.
That Unexpected moment, When Student Saw Principal at Class 💙😁 pic.twitter.com/EK3NZ8HR4e
— S H E B A S (@Shebas_10) September 30, 2021