ప్రకృతిలో మనిషికి అత్యంత ఆనందం ఇచ్చే అంశాల్లో శృంగారం ఒకటి. ఈ ప్రత్యేక అనుభూతి ఇచ్చే కిక్కే వేరు. అయితే, కన్యతో శృంగారం చేస్తే థ్రిల్లింగ్గా అనిపిస్తుందని కొందరు చెబుతుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. ఇప్పుడు ఇదంతా మాకెందుకు అనేగా మీ అభిప్రాయం. అయితే.. ఇది చదవాల్సిందే మరి. ‘హైమెనోప్లాస్టీ’.. కన్యత్వం కోల్పోయిన అమ్మాయిలు తిరిగి పొందగలిగే సర్జరీ. ఈ సర్జరీనే ప్రస్తుత ట్రెండ్.
కన్యత్వం అనేది దేశంలో చాలా సున్నితమైన అంశం. మహిళ తను వివాహం చేసుకున్న వ్యక్తితోనే శృంగారంలో పాల్గొని జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలని మన దేశంలో నమ్ముతారు. పెళ్లికి ముందు సన్నిహిత సంబంధాలను ఎవ్వరూ ఆమోదించరు. ఇది మహిళల వ్యక్తిగత వ్యవహారమైనప్పటికీ.. భారతీయుల ఆలోచనలు మాత్రం అందుకు భిన్నం. ఇదే విషయంలో.. పెళ్లికి ముందు పురుషులు లైంగిక సంబంధాలు కలిగి ఉంటే ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉండదు. మహిళల నైతిక ప్రమాణాలకు విలువ ఇవ్వకుండా చాలా మంది పురుషులు కన్యత్వం కలిగిన యువతినే పెళ్లి చేసుకోవాలనుకుంటారు.
ఇది కూడా చదవండి: వేసవికాలం శరీరంలో కొవ్వు పెరగకుండా ఉండాలంటే.. ఇవి తినండి!
ఇంకో రకంగా చెప్పాలంటే.. పెళ్లి కోసం ‘సరైన అమ్మాయి’ని ఎంచుకునే ప్రక్రియలో కన్యత్వం అనేది కూడా ప్రామాణికంగా ఉంటోంది. ఇలాంటి నియమాల మధ్య ఉండే ఏ అమ్మాయి అయినా.. సమాజం చేత ఆమోదం పొందాలనే భావిస్తుంది. ‘హైమెనోప్లాస్టీ’ చేయించుకునేవారి సంఖ్య పెరగడానికి కారణం అదే. సర్జరీలతో కన్యత్వాన్ని తిరిగి పొందాలనుకుంటున్న వారి సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతోంది. మెట్రో ప్రాంతాల్లోనే కాక చిన్న నగరాల్లోనూ ఇలాంటివి ఊపందుకున్నాయని డాక్టర్లు చెపుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజనప్పుడు.. ఈ చికిత్స కోసం ఎక్కువగా వస్తున్నట్లు డాక్టర్లు చెపుతున్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.