టాయిలెట్ లో 5 నిమిషాల కన్నా ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? ఐతే మీ కోసమే ఈ కథనం..
టాయిలెట్ లో కాలకృత్యాలు తీర్చుకోవడానికి 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే అని తెలుసుకోండి. మీరు బాత్రూంలో 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడిపినట్లైతే పెద్ద వ్యాధి బారిన పడాల్సి ఉంటుంది. బాత్రూంలో ఎక్కువ సేపు ఎందుకు కూర్చోకూడదు అనే విషయం మీద వైద్యులు అనేక హెచ్చరికలు చేస్తున్నారు. కొంతమంది పేపర్ చదువుతూ.. కొందరు మొబైల్ చూసుకుంటూ ఎక్కువ సమయం బాత్రూంలో కూర్చుని ఉండిపోతారు. అయితే ఇదే ఆరోగ్యానికి హాని వైద్యులు చెబుతున్నారు. ఈ అలవాటు ఉన్న వారు వెంటనే మార్చుకోమని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే?
టాయిలెట్ లో 5 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండడం సరైన పద్ధతి కాదని.. టాయిలెట్ లో న్యూస్ పేపర్ చదువుతూనే, ఫోన్ చూసుకుంటూ గడపడమే చేయడం వంటి అలవాట్లు ఆరోగ్యానికి నేరుగా హాని చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. అనేక తీవ్రమైన రోగాలకు దారి తీస్తుందని చెబుతున్నారు. ప్రజలు వారానికి సగటున ఎన్ని గంటలు టాయిలెట్ లో గడుపుతున్నారు అనే అంశం మీద బ్రిటన్ కి చెందిన టాప్స్ టైల్స్ కంపెనీ ఒక సర్వే నిర్వహించింది. అక్కడ జనాలు వారానికి సగటున మూడున్నర గంటలు బాత్రూంలోనే గడుపుతున్నారని సర్వేలో తేలింది. సింగిల్ సిట్టింగ్ అయితే ఒక వ్యక్తి సగటున 5 నిమిషాలు పడుతుందని.. ఆ వక్తి ఫ్రీగా ఉండడం కోసం రోజుకు 4 నుండి 7 సార్లు టాయిలెట్ కి వెళ్తారని సర్వే చెబుతుంది.
అయితే 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం కూర్చుంటే కనుక పైల్స్ కి దారి తీస్తుందని అంటున్నారు. టాయిలెట్ లో ఎక్కువ సేపు కూర్చోవడం వల్లే పైల్స్ వస్తాయని వైద్యులు చెబుతున్నారు. పాయువు లోపల రక్తనాళాలు ఎర్రబడి, ఒక ముద్దగా ఏర్పడినప్పుడు మూలశంక వ్యాధి వస్తుందని అంటున్నారు. టాయిలెట్ మీద కూర్చుని న్యూస్ పేపర్ చదవడం గానీ ఫోన్ వాడడం గానీ చేస్తుంటే అది పురీషనాళంపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. టాయిలెట్ సీట్ మీద కూర్చున్నప్పుడు పాయువు ప్రత్యేక స్థితిలో ఉంటుంది. దీని వల్ల దిగువ పురీషనాళంలోని సిరలపై అదనపు ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది మూలశంకకు కారణమవుతుంది. దీని వల్ల చాలా బాధ కలుగుతుంది.
టాయిలెట్ సీట్ పై ఎక్కువ సేపు కూర్చున్నా, బలవంతం చేసినా కూడా పురీషనాళం నుంచి రక్తస్రావం అవుతుంది. అయితే చాలా వరకూ పైల్స్ వాటంతటవే నయమవుతాయని బ్రిటన్ వైద్యులు చెబుతున్నారు. అయితే ఇన్ఫెక్షన్ లేదా పైల్స్ సమస్య మరీ ఎక్కువగా ఉంటే మాత్రం వెంటనే హాస్పిటల్ లో చేరాలని సూచిస్తున్నారు. పైల్స్ సమస్య బారిన పడకుండా ఉండాలంటే వ్యాయామం చేయాలని.. చేయని వారికి ఈ సమస్య ఎక్కువవుతుందని అంటున్నారు. మానసిక ఒత్తిడి వల్ల పగుళ్లు రావడం.. మలద్వారం వద్ద పెద్ద ప్రేగులో దురద, నొప్పి, రక్తస్రావం ఉంటాయి. పురీషనాళం గడ్డలు బయటకు రావడం మొదలవుతాయి.