ఏటికేడు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతూ పోతున్నాయి. ఈ వేసవిలో కూడా భానుడు ఒక రేంజ్లో మండిపోతున్నాడు. దీంతో ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది చల్లదనం కోసం ఏసీలకు బాగా అలవాటు పడుతున్నారు. అయితే ఎక్కువసేపు ఏసీలో ఉంటే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత కాలంలో ఎయిర్ కండీషనర్లను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందుటకు ఏసీలను వాడుతున్నారు. అయితే ఏసీ రూమ్‌ల్లో ఎక్కువసేపు ఉండటంతో ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి.. ఏసీల మీద ఇష్టం బాగా పెరిగింది. ఇంకా కొంతమంది అయితే ఆఫీసుల్లో, కార్లల్లో, ఇంట్లో కూడా రోజంతా ఏసీ కిందే గడిపేస్తున్నారు. వేసవి కాలంలో.. ఏసీ విలాసవంతమైన వస్తువు కంటే కూడా అవసరంగా మారింది. అయితే ఎక్కువసేపు ఏసీలో ఉంటే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని మీకు తెలుసా..? అంతేకాదు రోజంతా, రాత్రంతా ఏసీ గదుల్లో గడపడం మీకు హాయిగా ఉన్నా.. మీ శరీరంపై కొన్ని హానికర ప్రభావాలను కలుగజేస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు ఇప్పటికే డ్రై ఐ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. ఏసీ రూమ్స్‌లో ఎక్కువసేపు ఉంటే ఈ లక్షణాలు మరింత ఎక్కువవుతాయి. అదే విధంగా మీ కళ్లు పొడిబారితే.. మరింత పొడిబారే ఛాన్స్ ఉంది. దురద, చికాకుగా అనిపిస్తుంది. డ్రై ఐ సిండ్రోమ్ ఉన్నవాళ్లు ఎక్కువ టైమ్ ఏసీలో ఉండొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
మనం నిత్యం సాధారణ గదిలో ఉండే వాళ్లతో పోలీస్తే.. ఏసీ రూమ్‌లో ఉండేవాళ్లు తొందరగా డీహైడ్రేట్ అవుతారు. AC.. గది నుంచి తేమను ఎక్కువగా పీల్చుకుంటే, మీరు డీ హైడ్రేషన్‌కు గురవుతారు. ఉష్ణోగ్రతలు తక్కువగా సెట్ చేసి పెడితే.. మనకు చాలా చల్లగా ఉంటుంది. అలాగే మీరు నీళ్లు ఎక్కువగా తాగకపోయే ప్రమాదం ఉంది.
ఎక్కువసేపు ఏసీలో ఉన్నవాళ్లకి చర్మంపై తేమ తగ్గతుంది, పొడిబారుతుంది. ఇలాంటి లక్షణాలు మన చర్మంపై కనిపిస్తే మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.
మనం ఎక్కువసేపు ఏసీలో ఉండడం వల్ల ముక్కు, గొంతులో శ్వాససమస్యకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. ఇంకా గొంతు పొడిబారడం, రినిటిస్, ఊపిరిపీల్చుకోవడంలో ఇబ్బంది మెుదలవ్వడం.. ఇంకా ఏంటంటే ఏసీ కారులో, మూసి ఉన్నగదిలో ఉంటే.. అక్కడి సూక్ష్మజీవులు అక్కడే తిరుగుతుండటం వల్ల తేలిగ్గా శ్వాససంబంధమైన వ్యాధులకు గురవుతారు. నిత్యం ఏసీ గదుల్లో ఉండేవారు ప్రతి రెండు గంటలకు ఒకసారి బయటకు వచ్చి పది నిమిషాలు ఉండటం మంచిది.
అస్తమా, అలర్జిలతో బాధపడే వారి పరిస్థితి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. AC సరిగ్గా శుభ్రం చేయకపోయినా, దానిని సరిగ్గా మెయింటేన్ చేయకపోయినా.. అది ఆస్తమా, అలర్జీలను ట్రిగ్గర్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో.. అంటే ఆర్థరైటీస్, న్యూరైటీస్ వంటి సమస్యలు ఉన్నవారిలో కూడా సమస్యలు ఎక్కవవుతాయి. కొందరిలో ఈ న్యూరైటీస్ కారణంగా నిస్సత్తువ కలిగే అవకాశాలు ఎక్కువ.
ఏసీ రూమ్ లో ఎక్కువ సమయాన్ని గడిపితే.. డీహైడ్రేషన్ కు గురై తలనొప్పి, మైగ్రేన్ కు దారి తీస్తుంది. ఏసీ గదుల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఎక్కువసేపు ఏసీలో ఉన్న తర్వాత అకస్మాత్తుగా బయటకు వెళ్లినా మీకు తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏసీ గదుల నిర్వహణ సరిగ్గా లేకపోయినా.. తలనొప్పి, మైగ్రేన్ లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చాలాసేపు ఏసీలో ఉంటే చల్లదనం ఎక్కువవడం వల్ల పని పూర్తయ్యే సమయానికి కొందరిలో భరించలేనంత తలనొప్పి, తీవ్రమైన నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తాయి. చల్లటి వాతావరణంలో కండరాలకు తగినంత రక్తప్రసరణ జరగకపోవడం వల్ల అలసటకు గురవుతారు.