SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » health » Sunt Stroke Precautions And Prevention Tips In Telugu

Heat Stroke in Telugu: వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకొండి!

Sun Stroke/Heat Stroke in Teluguవేసవికాలంలో సాధారణంగా, తరచుగా కనిపించే ప్రధాన సమస్య.. వడదెబ్బ. ఈ సమస్య కారణంగా చాలా మంది మృత్యువాత కూడా పడతారు. మరి వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే.. ఏం చేయాలి..

  • Written By: Dharani
  • Published Date - Mon - 17 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Heat Stroke in Telugu: వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకొండి!

వేసవి కాలం ప్రారంభం అయ్యింది. ఏప్రిల్‌ నెలలోనే ఎండలు మండి పోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయట కాలు పెడదామంటే.. భయమేస్తోంది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో.. బయటకు రావాలంటేనే జనాలు భయపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక వేసవికాలం ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య.. వడదెబ్బ. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా.. పనులు మీద బయటకు వెళ్లే వాళ్లే కాదు.. ఇంట్లో ఉండే వృద్ధులు, పిల్లలు కూడా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. వడదెబ్బకు గురైనప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. మరి వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయి.. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

వడదెబ్బ..

దీన్నే హీట్‌ స్ట్రోక్‌ అని కూడా అంటారు. తీవ్రమైన వ్యాయామం, క్రీడాకారులు, వేడి వాతావరణంలో ఎక్కువగా పని చేసేవారు, డీహైడ్రేషన్‌, శరీరానికి సూర్యరశ్మి అధికంగా తగిలినప్పుడు వడదెబ్బ తగిలే అవకాశం అధికంగా ఉంటుంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఎక్కువగా వడదెబ్బ సమస్యను ఎదుర్కొంటారు.

వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తులు తీసుకోవాలి..

  • ఎక్కువగా ద్రవ పదర్థాలు అంటే మంచి నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, తాజా జ్యూస్‌లు అధికంగా తీసుకోవాలి.
  • రోజుకు 15 గ్లాసుల వరకు మంచి నీరు తాగాలి.
  • ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లకుండా చూసుకోవాలి.
  • బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీల లాంటివి తీసుకెళ్లాలి.
  • ఇంట్లో కిటికీ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచి, ఫ్యాన్ వేసి చల్లగా ఉంచుకోవాలి.
  • వేసవి కాలంలో లేత రంగు, తేలికైన, కాటన్‌ దుస్తులు ధరించడం మంచిది.
  • ఆల్కాహాల్‌ శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తుంది. కనుక వేసవిలో మద్యానికి దూరంగా ఉండటం మంచిది.
  • వేసవిలో తరచుగా ఓఆర్‌ఎస్‌, కొబ్బరి నీళ్లు, ఉప్పు కలిపిన నిమ్మరసం లాంటివి తీసుకోవాలి.
  • ఇవి శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి భర్తీ చేస్తాయి.
  • అలానే ఈ కాలంలో నీటి శాతం ఎక్కువగా ఉండే దోసకాయలు, పుచ్చకాయలు, దానిమ్మ, బత్తాయి లాంటి పండ్లు రోజు తినాలి.
  • వ్యాయామం చేసే వారు ఉదయం 8 గంటల లోపే పూర్తి చేయాలి.
  • వడదెబ్బ లక్షణాలు కనిపించగానే చికిత్స అందించాలి. లేదంటే శరీరం పూర్తిగా నీటిని కోల్పోయి.. బీపీ, పల్స్‌ పడిపోయి కొన్నిసార్లు ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది.

చేయకూడని పనులు..

  • వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయట ఎక్కువగా తిరగకూడదు.
  • ఎంత దాహం వేసినా సరే.. రోడ్ల మీద అమ్మే చల్లని రంగు పానీయాలను, కూల్ డ్రింక్స్ లను తాగకూడదు.
  • వేసవిలో వీలైనంత వరకు మాంసాహారాన్ని తగ్గించాలి. ఆహారంలో తాజా ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి.

వడదెబ్బ తగిలితే ప్రథమ చికిత్స..

  • వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లటి ప్రదేశానికి చేర్చాలి.
  • శరీరం మీద దుస్తులు వదులు చేయాలి.
  • ఐస్ నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం తుడవాలి.
  • శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేవరకు ఇలా చేస్తుండాలి.
  • బాధితుడికి ఫ్యాను గాలి, చల్లని గాలి తగిలేలా చూడాలి
  • వడదెబ్బ తగిలిని వ్యక్తికి కొబ్బరినీరు, చెరుకు రసాలు, పెరుగు, మజ్జిగ, పళ్లరసాలు, గ్లూకోజ్,ఓఆర్‌ఎస్‌ వంటి వాటిని తాగించాలి.
  • వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు తాగించకూడదు.
  • వీలైనంత త్వరగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.

Tags :

  • health news
  • Heat Stroke
  • Summer Season
Read Today's Latest healthNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

5 నిమిషాల కన్నా ఎక్కువ సేపు టాయిలెట్‌లో కూర్చుంటున్నారా? ఐతే జాగ్రత్త..

5 నిమిషాల కన్నా ఎక్కువ సేపు టాయిలెట్‌లో కూర్చుంటున్నారా? ఐతే జాగ్రత్త..

  • Diabetes: పెరట్లోని చెట్ల ఆకులతోనే షుగర్ వ్యాధిని తగ్గిస్తున్న మహిళ!

    Diabetes: పెరట్లోని చెట్ల ఆకులతోనే షుగర్ వ్యాధిని తగ్గిస్తున్న మహిళ!

  • Half Day Schools: విద్యార్థులకు ఊరట.. ఒంటిపూట బడుల తేదీ పొడిగింపు.. ఎప్పటి వరకూ అంటే?

    Half Day Schools: విద్యార్థులకు ఊరట.. ఒంటిపూట బడుల తేదీ పొడిగింపు.. ఎప్పటి వరకూ అంటే?

  • Smart Phones: మీ పిల్లలు ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారా? ఈ వ్యాధి కావచ్చు!

    Smart Phones: మీ పిల్లలు ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారా? ఈ వ్యాధి కావచ్చు!

  • ACలో ఎక్కువసేపు ఉంటున్నారా? ఈ సమస్యలు వస్తాయ్‌ జాగ్రత్త..!

    ACలో ఎక్కువసేపు ఉంటున్నారా? ఈ సమస్యలు వస్తాయ్‌ జాగ్రత్త..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam