ప్రముఖ సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ‘‘మ్యోసిటిస్’’ (Myositis) అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తాను మ్యోసిటిస్‌తో బాధపడుతున్నట్లు స్వయంగా ఆమే తన సోషల్ మీడియా ఖాతాల్లో చెప్పుకొచ్చారు. ఈ మేరకు పోస్టులు పెట్టారు. ‘‘ కొన్ని రోజుల క్రితం నాకు ఓ ఆటో ఇమ్యూన్ కండీషన్ ఉన్నట్లు తేలింది. దాని పేరు మ్యోసిటిస్. నేను ఇది తగ్గిన తర్వాత ఈ విషయం గురించి మీతో పంచుకోవాలని అనుకున్నాను. కానీ, ఇది తగ్గటానికి చాలా టైం తీసుకునేలా ఉంది. నేను త్వరలో దీన్నుంచి కోలుకుంటాన’’ని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మ్యోసిటిస్ వ్యాధి గురించి నెటిజన్లు వెతకటం మొదలు పెట్టారు. ఆ వ్యాధి ఏంటి? దాని లక్షణాలు ఏంటి? అన్న వివరాల గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ‘‘మ్యోసిటిస్’’ ఏంటి? ఆ వ్యాధి ప్రాణాంతకమా అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం!
మ్యోసిటిస్ అనేది కొన్ని అరుదైన కండీషన్ల కలయిక. మన శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థలో సమస్య కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. మ్యోసిటిస్‌లో పలు రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే..
వైద్యులు రక్త పరీక్షల ద్వారా మన శరీరంలోని ఎంజైమ్స్, యాంటీ బాడీల పెరుగుదలను గుర్తిస్తారు. కొద్దిగా కండరాళ్ల కణజాలం లేదా చర్మాన్ని తీసి పరీక్ష చేస్తారు. తద్వారా వాపు, డ్యామేజ్ ఇతర విషయాలను కనుగొంటారు. ఎమ్‌ఆర్‌ఐ స్కాన్స్ ద్వారా కూడా ఈ వ్యాధి గుర్తించవచ్చు.
వైద్యుల సంరక్షణలో చికిత్స తీసుకోవటం ఎంతో ముఖ్యం. వారు చెప్పిన విధంగా వ్యాయామం చేయటం ఎంతో ఉపయోగపడుతుంది. కండరాళ్ల వాపును తగ్గించటంతో పాటు కొత్త శక్తిని ఇస్తుంది. ఫిజియోథెరపీ కూడా అన్ని రకాల మైసిటిస్‌ను తగ్గించటానికి ఉపయోగపడుతుంది. ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తించి.. స్టేజీలకు తగిన విధంగా చికిత్స చేయించుకోవాలి. సరైన చికిత్స అందకపోయినా.. అసలు చికిత్స తీసుకోకపోయినా నష్టం తప్పదు. ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది.